‘గ్రేటర్ పౌరులపై పన్నుల భారం పడనున్నది. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని భారీగా పెంచేసింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేషన్ల భారం ఇప్పటికే నడ్డి విరిచింది.. ఆ భారం నుంచి కోలుకోకముందే, త్వరలో ట్రై కార్పొరేషన్లలో ఒకే పన్ను విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. క్యూర్ బిల్లు ముసుగులో జీహెచ్ఎంసీ పౌరులపై వడ్డీ భారం మోపేందుకు సన్నద్ధమైనది. త్వరలోనే జరిగే అసెంబ్లీ సమావేశాల్లో క్యూర్ బిల్లు ఆమోదం తర్వాత ఆస్తిపన్ను భారం పడనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో, ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెకించనున్నారు. ఒకవైపు ఆదాయాలు పెరగక, మరోవైపు పెరిగిన జీవన వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న సగటు పౌరుడిపై ఈ ‘క్యాపిటల్ వ్యాల్యూ’ పన్ను విధానం కోలుకోలేని దెబ్బ కానుంది. సరారు సాగిస్తున్న ఈ పన్నుల వేటపై గ్రేటర్ పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.’
సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధిలో ఆస్తి పన్ను లెకింపు విధానంలో భారీ మార్పులకు కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు అనుసరిస్తున్న సాధారణ పద్ధతులకు స్వస్తి చెప్పి, రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్న మారెట్ విలువ (క్యాపిటల్ వ్యాల్యూ) ఆధారంగా ప్రతి ఆస్తికి సంబంధించిన పన్నును ప్రాపర్టీ టాక్స్ ఇండెక్స్ నంబర్ (పీటీఐఎన్) కు అనుసంధానించాలని అధికారులు నిర్ణయించారు. దీనిద్వారా కార్పొరేషన్ రాబడిని గణనీయంగా పెంచుకోవాలని భావిస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం నగరంలో మారెట్ విలువతో అనుసంధానించిన ఆస్తుల సంఖ్య మొత్తం 13,22,966 ఉండగా, ఇందులోనివాస గృహాలు 10,75,113, వాణిజ్య సముదాయాలు 2,18,820, మిశ్రమ ఆస్తులు 29,033లు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆస్తుల ద్వారా జీహెచ్ఎంసీకి ప్రతిఏటా రూ. 824.24 కోట్ల వార్షిక డిమాండ్ (నివాస రంగానికి రూ. 293.54 కోట్లు, వాణిజ్య రంగానికి రూ. 465.66 కోట్లు, మిశ్రమ ఆస్తులకు రూ. 65.06 కోట్లు) ఉంది. నూతన క్యాపిటల్ వ్యాల్యూ ఆధారంగా పన్ను విధించేందుకు మూడు రకాల మోడళ్లను ప్రతిపాదించారు.
డేటా మ్యాపింగ్లో లోపాలు..
అధికారులు పలు సాంకేతిక సవాళ్లను ఎదురొంటున్నారు. సరిళ్ల డే టాలో తేడాలు ఉన్నాయి. శేరిలింగంపల్లి, చందానగర్, ఆర్సీపురం, కు త్బుల్లాపూర్,గాజులరామారం వంటి 5 మున్సిపల్ సరిళ్లలో జీహెచ్ఎం సీ, రిజిస్ట్రేషన్ శాఖల వద్ద ఉన్న వార్డు సంఖ్యలు, బ్లాక్ నంబర్లు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో వేలాది ఆస్తులను కచ్చితమైన మారెట్ విలువతో మ్యా పింగ్ చేయడంలో సాంకేతిక అడ్డంకులు ఏర్పడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒకే వార్డు/బ్లాక్ పరిధిలో వేర్వేరు స్థానికతలలో వేర్వేరు చదరపు అడుగుల ధరలు ఉన్నప్పటికీ, విశ్లేషణ సులభతరం చేయడం కోసం అతి తకువ ఆధారిత ధరను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ముసాయిదా నివేదిక ప్ర స్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రభుత్వం ఏ శాతాన్ని ఆమోదిస్తుందనే దానిపై నగరవాసులపై పడే ఆస్తి పన్ను భారం ఆధారపడి ఉంటుంది.
ఊహించని స్థాయిలో భారం
పౌరులపై ప్రభుత్వం మరో పన్నుల పిడుగు వేయడానికి సిద్ధమైంది. ట్రై కార్పొరేషన్ల పరిధిలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేడెట్ గవర్నెన్స్) బిల్లు -2026 క్యూర్ బిల్లును తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నయా చట్టం అమల్లోకి వస్తే గ్రేటర్ పరిధిలోని 19.49 లక్షల మంది ఆస్తిపన్ను యజమానులపై పన్నుల భారం రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు వాటి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి వచ్చే అద్దె ఆధారంగా నామమాత్రంగా పన్నులు విధిస్తున్నారు. కానీ కొత్త విధానం ప్రకారం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ విలువ లేదా మారెట్ రేట్ల ఆధారంగా పన్ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఐటీ కారిడార్, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఒక సాధారణ ఇంటి మారెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం వల్ల ఆ భారీ ‘క్యాపిటల్ వ్యాల్యూ’పై పన్ను లెకగడితే, ఏటా కట్టే ఆస్తి పన్ను భారం ఊహించని స్థాయికి చేరుకుంటుంది.