దంచికొట్టిన వాన
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు చెరువులయ్యా యి. ఎక్కడ చూసినా వరదనీరు వెల్లువెత్తింది. ఆఫీసులనుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరాయి. కుండపోత వర్షానికి కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది.
- నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- చెరువులను తలపించిన రోడ్లు
- కిలోమీటర్ దూరానికి గంట సమయం
- గంటల తరబడి రోడ్లపైనే వాహనదారులు
సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భాగ్యనగరాన్ని ముంచెత్తింది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్లు చెరువులయ్యా యి. ఎక్కడ చూసినా వరదనీరు వెల్లువెత్తింది. ఆఫీసులనుంచి ఇళ్లకు బయలుదేరే సమయం కావడంతో ప్రధాన రహదారులపై వాహనాలు బారులు తీరాయి. కుండపోత వర్షానికి కాలనీల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. రాజేంద్రనగర్‌లో ప్రారంభమైన వర్షం క్రమంగా నగరమంతా విస్తరించింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఖైరతాబాద్, లక్డీకాపూ ల్, నాంపల్లి, కోఠి, బేగంపేట్, సికింద్రాబాద్, మ ణికొడ, గచ్చిబౌలి, మాదాపూర్,హైటెక్‌సిటీ, కొం పల్లి, ఓల్డ్‌సిటీ, అంబర్‌పేట, కాచిగూడ మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, చైతన్య పురి, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్ తదితరప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలుచోట్ల డ్రైనేజీలు పొంగి పొర్లాయి. ముషీరాబాద్‌లో అత్యధికంగా 31 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణశాఖ తెలిపింది. వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీచడంతో పలుప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలకు ఆటంకమేర్పడింది. ట్రాఫిక్ సమస్యతో చాలామంది మెట్రోను ఆశ్రయించగా మెట్రోరైళ్లు, స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.

నీటమునిగిన కాలనీలు&
మహానగరాన్ని భారీ వర్షం కుదిపేసింది. సాయంత్రం నుంచి రాత్రి దాకా కురిసిన భారీ వర్షంతో కాలనీలన్నీ నీట మునిగాయి. రోడ్లన్నీ నదులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయయ్యాయి. నాలాలు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగి మురుగు ఏరులై పారింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ముషీరాబాద్, షేక్‌పేట, తిరుమలగిరి, ఖైరతాబాద్, బాలానగర్, శేరిలింగంపల్లి, అమీర్‌పేట, కూకట్పల్లి ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలు నదులను తలపించాయి.
ఎటుచూసినా ట్రాఫిక్ జామే..
సాయంత్రం హఠాత్తుగా కుండపోత వర్షం కురియడంతో ఇళ్లకు వెళ్లడానికి ఆఫీసుల నుంచి బయటకువచ్చిన ఉద్యోగులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్‌లతో ప్రధానకూడళ్లన్నీ నిండిపోయాయి. కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలు, ఆర్టీసీ బస్సులు ట్రాఫిక్‌లో చిక్కుకుని నత్తనడకన కదలడంతో ఉద్యోగులు, ప్రయాణికులు గంటలతరబడి రోడ్లపైనే ఉన్నారు. మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో కిలోమీటర్ దూరం ముందుకుసాగడానికి సుమారు పదిహేను నుంచి ఇరవై నిముషాల సమయం పట్టిందని వాహనదారులు చెప్పారు. చాదర్‌ఘాట్ నుంచి మలక్‌పేట రైల్వే అండర్‌పాస్ వరకు నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఎస్ఆర్నగర్ ఆర్యూబీ వద్ద నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు చాలా నెమ్మదిగా ముందుకు కదిలాయి. హైదర్‌గూడ పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లైఓవర్కింద కొన్ని పిల్లర్ల వద్ద వర్షపు నీరు నిలిచిపోవడంతో ఆ మార్గమంతా ట్రాఫిక్ జామ్ అయింది. కోఠిలో రహదారులపై నీరు చేరి ట్రాఫిక్ జామ్ అవడంతో ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకుంది.
ఇళ్లనుంచి బయటకు రావొద్దు..
నగర ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నదని, వాహనదారులు, నగరవాసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాలను నెమ్మదిగా నడపాలని చెప్పారు. సోషల్‌మీడియా వేదికల ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అందిస్తున్న హెచ్చరికలు ఎప్పటికప్పుడు అనుసరించాలని వారు కోరారు. డీఆర్ఎఫ్, మాన్సూన్ టీమ్స్, ట్రాఫిక్పోలీసులు రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో డ్రైనేజీలు శుభ్రం చేస్తూ ట్రాఫిక్‌ను నియంత్రించే ప్రయత్నం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించగా, వర్షం కురుస్తున్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ఇళ్లనుంచి బయటకు రావద్దని పోలీసులు సోషల్‌మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
నమోదైన వర్షపాతం:(సెంటీమీటర్లలో)
ఎంసీహెచ్ కాలనీ:- 4.7
బౌద్ధానగర్ :-4.7
బన్సీలాల్‌పేట :-4.43
ఎంసీహెచ్ఆర్డీసీ ఐటీ క్యాంపస్ :-4.10
బోలక్పూర్ :-3.9
జింఖానా గ్రౌండ్స్ :-3.8
రహ్మత్‌నగర్ :-3.8
ఫతేనగర్ :-3.8
ఉస్మానియా యూనివర్సిటీ :-3.7
తాళ్ల బస్తీ: -3.7
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

