(MP Kanakamedala) న్యూఢిల్లీ: ఇటీవల భారీ వరదలకు అన్నమయ్య ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయిన అంశాన్ని టీడీపీకి చెందిన ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ మంగళవారం నాడు రాజ్యసభలో లేవనెత్తారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ఆయన ప్రస్తావించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఆయన ఆరోపించారు. ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించినందునే ఇటీవలి వరదలకు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ రాజ్యసభలో ఆరోపించారు. వరదల సమయంలో ప్రాజెక్టు గేట్లు సకాలంలో తెరుచుకోకనే నష్టం సంభవించిందని, ప్రజల ప్రాణాలతో ఏపీ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్వహణ లోపం కారణంగా భారీ నష్టం చోటు చేసుకున్నదని చెప్పారు. ఈ నష్టానికి బాధ్యులు ఎవరన్నది కేంద్రమే తేల్చాలని కోరారు. కేంద్రం స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో గత నెలలో కుండపోతగా కురిసిన వర్షాలకు భారీ వరదలు ముంచెత్తాయి. దాంతో అన్నమయ్య, ఫించ జలాశయాల కట్టలు తెగిపోయాయి. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం సంభవించి.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..