(Weaving Clusters) అనంతపురం: కేంద్ర చేనేత, జౌళి శాఖ మంజూరు చేసిన మూడు చేనేత కార్మికుల క్లస్టర్ల కార్యాచరణ అటకెక్కింది. ఒక్కో క్లస్టర్‌కు కేంద్రం రూ.2 కోట్లు మంజూరు చేసినా.. రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం కారణంగా ఈ మూడు క్లస్టర్ల ఏర్పాటుకు నోచుకోలేదు. పుట్టపర్తి క్లస్టర్లో 220 మంది చేనేత కార్మికులు, ధర్మవరంలో 300 మంది చేనేత కార్మికులు, ఉరవకొండ క్లస్టర్లో 265 మంది చేనేత కార్మికులు లబ్ధి పొందనున్నారు. చేనేత, జౌళి శాఖ 71 క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపగా.. మొదటి దశలో 3 క్లస్టర్లకు మాత్రమే అనుమతి లభించింది. ధర్మవరం నుంచి అత్యధికంగా 34 క్లస్టర్లకు ప్రతిపాదనలు వెళ్లగా గతంలో ఒక్క క్లస్టరే మంజూరైంది. జిల్లాలోని చేనేత కార్మికులు 71 క్లస్టర్లు కావాలని కోరగా ప్రభుత్వం కేవలం 3 క్లస్టర్లను మంజూరు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇలా స్పందిస్తున్నదని అనుకోలేదని ఐదు దశాబ్దాలుగా వృత్తిలో ఉన్న ధర్మవరం చేనేత కార్మికుడు చౌడప్ప అన్నారు. వేలాది మంది నేత కార్మికుల ఆకాంక్షలు ఎప్పుడు నెరవేరుతాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదు దశాబ్దాల్లో నేతన్నల బతుకులు పెద్దగా ఏమీ మారలేదని, ఈ క్లస్టర్ల ఏర్పాటు భవిష్యత్‌లో మారుతాయని భావించి భంగపడుతున్నట్లు విచారం వ్యక్తం చేశారు. ఇలా ఉండగా, మూడు క్లస్టర్ల ఏర్పాటులో అనేక అడ్డంకులు వచ్చాయని, ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని చేనేత జౌళి శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ ప్రాతిపదికన క్లస్టర్లను గ్రౌండ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
జిల్లాకు అరకొర నిధులు మంజూరు చేసి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఏపీ చేనేత కార్మికుల రాష్ట్ర కార్యదర్శి చలపతి విమర్శించారు. ధర్మవరానికి ఒకే క్లస్టర్ కేటాయించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం అన్ని ప్రతిపాదనలను క్లియర్ చేసి లక్ష మంది నేత కార్మికులకు పని కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..