(Covid positive) రాజమండ్రి : విదేశాల నుంచి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చిన ముగ్గురిలో కొవిడ్ వైరస్ బయటపడింది. దాంతో ఒమిక్రాన్ కేసులు వ్యాపిస్తున్నాయంటూ పుకార్లు బయలుదేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఒమిక్రాన్ కేసులేవీ బయటపడలేదని, సాధారణ కొవిడ్ కేసులే అని అధికారులు సెలవిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ఒమిక్రాన్‌పై అనుమానాస్పద వదంతులు వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, విదేశీల నుంచి తిరిగొచ్చిన ముగ్గురిలో విదేశీ తిరిగి వచ్చిన వారికి కొవిడ్-19 పాజిటివ్ తేలిందని జిల్లా కలెక్టర్ చేవూరి హరికిరణ్ తెలిపారు. వీరిని జిల్లాలోని ఒక దవాఖానలో నిర్బంధంలో ఉంచినట్లు చెప్పారు. వీరిలో ఇద్దరు సింగపూర్‌కు చెందినవారు కాగా, ఒకరు బంగ్లాదేశ్‌కు చెందినవారు. నాలుగు రోజులుగా వీరు జిల్లాలోనే మకాం వేసినట్లు కలెక్టర్ చెప్పారు. వీరు తమ దేశాల నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించే ముందు చేసిన పరీక్షల్లో నెగెటివ్ అని తేలిందని కలెక్టర్ పేర్కొన్నారు. అయితే, వీరు జిల్లాకు చేరుకున్న అనంతరం కొవిడ్-19 పాజిటివ్ తేలడంతో వారిని క్వారంటైన్లో ఉంచారు. తదుపరి పరీక్ష, నిర్ధారణ నిమిత్తం వారి నివేదికలను హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) కు పంపినట్లు హరికిరణ్ తెలిపారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..