రుద్రంపూర్, ఫిబ్రవరి 23 : ఇండియన్ లీగల్ ప్రోఫేషనల్స్ అసోసియేషన్ (ఐ.ఎల్.పీ.ఏ) తెలంగాణ రాష్ట్ర మహిళా న్యాయవాదుల సదస్సును జయప్రదం చేయాలని ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సాధనాల భానుప్రియ, మహమ్మద్ సాదిక్ పాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జనపరెడ్డి గోపి కృష్ణ మాట్లాడుతూ.. మహిళా న్యాయవాదులకు వృత్తి నైపుణ్యంలో శిక్షణతో పాటు, న్యాయవాదుల సమస్యల పరిష్కరం కోసం తీసుకునే చర్యల గురించి చర్చించి నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు సుజాత ఛౌడంటే తో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి లో ప్రముఖ మహిళా న్యాయవాదులు పాల్గొని ప్రసంగించనున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పీఏ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భాథ్యులు పగిడిపల్లి శ్రీకాంత్, ఆడపాల పార్వతి, మల్లెల ఉషా రాణి, కాకటి నీలివేణి, గుమ్మడి శాంత, లక్ష్మి సరిత, బేబి షామిలి, నకిరేకంటి ఉమా, భార్గవి, రజిత, న్యాయవాదులు రేపాక మనోరమా, ఏపూరి బాబురావు, ఉటూకురి పురుషోత్తం, రావి విజయ్ కుమార్, జీవికే మనోహర్ రావు, ఉట్లా రాజేశ్వరావు, భాగం మాధవ రావు, కాటబోయిన స్వర్ణలత, నాగ శ్రావంతి, ఇందిరా ప్రియదర్శిని పాల్గొన్నారు.