గద్వాల: మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు తగుముఖం పట్టడంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాంలో నుంచి జూరాల డ్యాంకు(Jurala Project )వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో జూరాల గేట్లు మూసి వేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. అయితే జూరాల ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 80000 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 39 608 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ఆరు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318. 516 మీటర్లు కాగా ప్రస్తుతం 317. 51 మీటర్లుగా నమోదయింది. టీఎంసీలలో జూరాల ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7. 663 టీఎంసీలు ఉంది. వరదలు తగ్గుముఖం పట్టడంతో జూరాల గేట్లు మూసివేశారు విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.