ఆదిలాబాద్ : విమానాశ్రయం ( Adilabad Airport ) ఏర్పాటులో భాగంగా భూసేకరణ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట రైతులు బైటాయించి నిరసన తెలిపారు. ఎకరాకు రూ.2 కోట్లు పరిహారం ( Compensation ) ఇవ్వాలని నినాదాలు చేశారు. విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నామని బీజేపీకి ఎంపీ నగశ్ ( MP Nagesh ) , ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రకటించి మ్యాపు విడుదల చేశారని, దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు .
భూముల విషయంలో సర్వే నెంబర్లతో పాటు ఎన్ని ఎకరాలు తీసుకుంటారనే విషయం వెల్లడించాలని కోరారు. ప్రస్తుతం మార్కెట్ విలువ ఎకరాకు రూ.2 కోట్లు ఉందని, భూసేకరణ జరిపితే ప్రభుత్వం ఆ ధర చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు.
తమ అవసరాల కోసం భూములను విక్రయించుకుందామంటే ఎయిర్పోర్టులో పోతున్నాయ ని ప్రచారం జరగడంతో ఎవరు కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భూములు ఏ మేరకు పోతున్నాయి అనే విషయాన్ని కలెక్టర్ స్పష్టం చేయాలంటూ రైతులు డిమాండ్ చేశారు.