(Covid cases) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 163 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20,75,271 కరోనా వైరస్ కేసులు వచ్చాయి. గత ఇరవై నాలుగు గంటల్లో నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మూడు కొత్త మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం మరణాల సంఖ్య 14,471 కు చేరుకున్నది. మరోవైపు, గత ఇరవై నాలుగు గంటల్లో 162 మంది కొత్త రోగులు నయమై డిశ్చార్జీ అయ్యారు. వీరితో కలుపుకుని మొత్తం రికవరీల సంఖ్య 20,58,797 కి చేరుకోగా.. ప్రస్తుతం 1821 పాజిటివ్ కేసులున్న వారు చికిత్సపొందుతున్నారు.
జిల్లాల వారీ డాటా ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాలో 25 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 25, పశ్చిమ గోదావరిలో 20, కర్నూలు జిల్లాలో మూడు కొత్త కేసులతో అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ గత ఇరవై నాలుగు గంటల్లో 35,071 పరీక్షలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 3.08 కోట్ల కొవిడ్-19 పరీక్షలను నిర్వహించింది. మరోవైపు, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,984 కేసులు, 247 మరణాలు రికార్డయ్యాయి. ఇంతలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒమిక్రాన్ వేరియంట్ కేసును గుర్తించారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నది. ఈ వేరియంట్ వ్యాప్తిని పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..