(AP man arrest) కోజికోడ్: వటకర సమీపంలోని తాలూకా కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించిన ఘటనలో ఏపీకి చెందిన ఒక వ్యక్తిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన సతీష్ నారాయణన్‌ను విచారిస్తున్నట్లు కోజికోడ్ రూరల్ ఎస్పీ శ్రీనివాస్ తెలిపారు.
తాలూకా కార్యాలయంలో అగ్నిప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించారు. ఫుటేజీ ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు దీని వెనుక ఏపీకి చెందిన సతీష్ నారాయణన్ ఉన్నట్లు తేలడంతో ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, అతనే నేరం చేసినట్లు ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లేవని పోలీసు వర్గాలు తెలిపాయి. మానసికంగా అస్థిరంగా ఉన్న ఆయన.. మరికొన్ని ప్రాంతాల్లో ఇదే మాదిరిగా నిప్పంటించేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తున్నది. గురువారం తెల్లవారుజామున తాలూకా కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో పాత భవనం పాక్షికంగా దగ్ధం కావడంతో పాటు కార్యాలయంలోని దాదాపు 80 శాతం ఫైళ్లు, రికార్డులు దగ్ధమయ్యాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..