Today History : పూర్తిగా మంచుతో కప్పబడిన అంటార్కిటికా ఖండాన్ని గుర్తించడంతోపాటు అక్కడ కాలిడి నేటికి సరిగ్గా 110 ఏండ్లు పూర్తయ్యాయి. నార్వేకు చెందిన రోల్డ్ అమండ్సన్ అనే వ్యక్తి 16 కుక్కలను వెంటపెట్టుకుని 1911 లో సరిగ్గా ఇదే రోజున అంటార్కిటికా ఖండంలోకి అడుగేశాడు. అమండ్సన్ తన యాత్రను అదే ఏడాది అక్టోబర్ 19 న ప్రారంభించి సరిగ్గా రెండు నెలలకు ఆ ప్రాంతానికి చేరుకోవడం ద్వారా అంటార్కిటికాలో కాలిడిన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందారు. దక్షిణ ధృవం పర్యటనలో అమండ్సన్ బృందంలో ముగ్గురు మగ వ్యక్తులతోపాటు 52 కుక్కలు ఉండగా.. అంటార్కిటికాకు చేరుకునే సమయానికి 16 కుక్కలు మాత్రమే మిగిలాయి. మిగిలిన కుక్కలను వారు తిన్నట్లుగా భావిస్తుంటారు.
అమండ్సన్ బృందం 1911 అక్టోబర్ 19 న అంటార్కిటికాకు బయలుదేరి దాదాపు రెండు నెలల పాటు ప్రయాణించిన తర్వాత అక్కడికి చేరుకున్నది. అమండ్సన్ తర్వాత అదే ఏడాది నవంబర్ 1 న నార్వేకు చెందిన రాబర్ట్ స్కాట్ బృందం కూడా దక్షిణ ధృవం వైపు ప్రయాణమైంది. అయితే, అతడి బృందం అంటార్కిటికా చేరుకోవడానికి ముందే అమండ్సన్ చేరిపోయారు. రాబర్ట్ స్కాట్ బృందం 1912 జనవరి 17 న అంటార్కిటికాలోకి ప్రవేశించింది. అయితే, దక్షిణ ధృవం నుంచి తిరిగి వస్తుండగా రాబర్ట్ స్కాట్ మరణించాడు.
ఇలాఉండగా, 1928 జూన్ 18 న ఉత్తర ధ్రువం నుంచి తిరిగి వస్తున్న విమానం ఒకటి తప్పిపోయింది. ఈ విమానంలో 55 ఏండ్ల రోల్డ్ అమండ్సన్ కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఆ విమానం జాడ దొరకలేదు. ఈ ప్రమాదంలో అమండ్సన్ మరణించినట్లు భావిస్తున్నారు. 2003 లో అమండ్సన్తోపాటు విమానంలో ఉన్న వ్యక్తుల మృతదేహాలను కనుగొనే ప్రయత్నం జరిగినప్పటికీ విఫలమైంది.
2007: ఉత్తర కొరియా-దక్షిణ కొరియాల మధ్య 50 ఏండ్ల తర్వాత రైలు సేవలు పునఃప్రారంభం
2007: ముసాయిదా బాలి ఒప్పందం నుంచి వివాదాస్పద నిబంధనలు తొలగింపు
2003: మెక్సికోలోని మెరిడాలో జరిగిన సమ్మేళనంలో మొదటి అవినీతి నిరోధక ఒప్పందంపై సంతకం చేసిన 73 దేశాలు
2000: యునైటెడ్ స్టేట్స్ 43వ అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్ వాకర్ బుష్
1997: గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేందుకు అంగీకరించిన ప్రపంచంలోని అన్ని దేశాలు
1995: ప్యారిస్‌లో డేటన్ ఒప్పందంపై సంతకం చేసిన బోస్నియా, సెర్బియా, క్రొయేషియా దేశాల ప్రతినిధులు
1983: తనకు తాను బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జనరల్ హుస్సేన్ మొహమ్మద్ ఎర్షాద్
1982: 13 ఏండ్ల తర్వాత తిరిగి తెరుచుకున్న బ్రిటిష్ కాలనీ జిబ్రాల్టర్-స్పెయిన్ మధ్య ఉన్న భారీ గ్రీన్ గేట్
1946: భారత రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
1924 : అప్పటి పాకిస్థాన్ ప్రాంతంలోని పెషావర్‌లో ప్రసిద్ధ నటుడు రాజ్ కపూర్ జననం
1922 : యునైటెడ్ కింగ్డమ్లో సాధారణ ఎన్నికలు
1921 : అన్నీబీసెంట్కు డాక్టర్ ఆఫ్ లెటర్స్ బహూకరించిన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..