(Cheddi gang) విజయవాడ: వరుస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్న చెడ్డీ గ్యాంగ్‌లోని ఇద్దరు సభ్యులను అరెస్ట్ చేసినట్లు సమాచారం. మిగతా ఐదుగురు సభ్యులను కూడా గుర్తించిన విజయవాడ పోలీసులు.. వారిని పట్టుకునేందుకు గుజరాత్ రాష్ట్రంలో మకాం వేశారు. విజయవాడలో ఎన్ని దొంగతనాలకు పాల్పడ్డారు అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
దొంగతనాలతో విజయవాడవాసులకు చెడ్డీగ్యాంగ్ దొంగలు నిద్ర లేకుండా చేస్తున్నారు. వీరిపై గట్టి నిఘా పెట్టిన విజయవాడ పోలీసులు.. ముఠాలోని ఇద్దరు సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసులు తమ అదుపులో ఉన్న వారిని ఒకవైపు విచారిస్తూనే.. మరోవైపు మిగతా ముఠా సభ్యులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో ఈ ముఠా మూలాలను గుర్తించిన పోలీసులు.. గత నేరాలను దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల రాష్ట్రంలోకి ప్రవేశించిన ముఠా.. విజయవాడ ఘటనల ఆధారంగా గుజరాత్‌లోని దాహోద్ జిల్లాకు చెందినదిగా నిర్ధారణకు వచ్చారు. ముఠాలోని ఇద్దరు పట్టుబడగా.. వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తున్నది. అయినప్పటికీ ఇప్పటికే దొంగలను గుర్తించడంతో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గుజరాత్లో మకాం వేసి గాలిస్తున్నాయి. వీరిని ఏ క్షణంలోనైనా పట్టుకునే అవకాశాలు ఉన్నాయని విజయవాడ పోలీసులు అంటున్నారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..