Youtube | ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ సేవల్లో అంతరాయం నెలకొంది. మంగళవారం రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ సేవలు నిలిచిపోయాయి. మొబైల్, కంప్యూటర్లలో యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ‘something went wrong’ అని చూపిస్తోంది. కొంతమందికి యూట్యూబ్ వీడియోలు లోడ్ కావడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అమెరికాలోనే మూడు లక్షలకు పైగా యూజర్లు డౌన్ డిటెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అవుట్‌టేజ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. ఈ సమస్య మంగళవారం రాత్రి 8 గంటలకు అమెరికాలో మొదలైంది. తమ వెబ్‌సైట్‌కు అమెరికాలో 3,20,000 కంటే ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు. ఇండియా నుంచి కూడా 18 వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వీడియోలు ప్లే కావడం లేదని, సెర్చ్ రిజల్ట్ కనిపించడం లేదని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
యూట్యూబ్ సాంకేతిక సమస్యలపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించింది. స్ట్రీమింగ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని తెలిపింది. సమస్కయ పరిష్కారం కోసం పనిచేస్తున్నామని పేర్కొంది.