Buchi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై ఇప్పటికే మంచి హైప్ ఏర్పడింది. గేమ్ ఛేంజర్ తరువాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఈ కథపై ఆయన ప్రశంసలు కురిపిస్తూ, బుచ్చిబాబు రాసిన స్టోరీ ఎంతో గొప్పదని పేర్కొన్నారు.
బుచ్చిబాబుకు శివరాజ్‌కుమార్ స్పెషల్ గిఫ్ట్
ఇటీవల దర్శకుడు బుచ్చిబాబుకు శివరాజ్‌కుమార్ ప్రత్యేక బహుమతి అందజేయడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాన్ని బుచ్చిబాబు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శివరాజ్‌కుమార్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, ఆ గిఫ్ట్ తనకు ఎంతో ఎమోషనల్ మూమెంట్‌గా అనిపించిందని పేర్కొన్నారు. అయితే ఆ బహుమతి ఏమిటి అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చివరి దశలో షూటింగ్
‘పెద్ది’ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ముఖ్యంగా క్రికెట్‌కు సంబంధించిన ఓ భారీ సీక్వెన్స్‌ను చిత్రబృందం చిత్రీకరిస్తోంది. త్వరలోనే రెండో పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాతో రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ చేరడం గ్యారెంటీ అని అంటున్నారు అభిమానులు.