Pedda Dargah: పెద్ద దర్గాలో మొదలైన ఉర్సు ఉత్సవాలు
Pedda Dargah: ప్రసిద్ధ పెద్ద దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ ఏడాది...

(Pedda Dargah) కడప: ప్రసిద్ధ పెద్ద దర్గాలో ఉర్సు ఉత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. కొవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ ఏడాది సాదాసీదాగా వేడుకలు జరపాలని దర్గా నిర్వాహకులు నిశ్చయించారు. కేవలం దర్గాలోని శిష్యుల ఆధ్వర్యంలోనే ఉర్సు జరుపుతున్నారు. ఉదయం 10 గంటలకు చదివింపులు, రాత్రి 8 గంటలకు మాలింగ్ షాను పీరి స్థానంలో కూర్చోబెట్టడం, రాత్రి 9.45 గంటలకు పీఠాధిపతి ఇంటి నుంచి గంధం తీసుకొచ్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
కడప పెద్ద దర్గా ఉర్సు ఉత్సవాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు దర్గా ఆవరణలో చదివింపులతో ఉత్సవాలను దర్గా పీఠాధిపతి ఆరిఫ్ ఉల్లా హుస్సేన్ ప్రారంభించారు. ఒమిక్రాన్, కొవిడ్ నేపథ్యంలో నిబంధనలు విధించినప్పటికీ చదివింపుల కోసం పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఏటా నిర్వహించే కవ్వాలి, జాతీయ స్థాయి కవి సమ్మేళనం, ఎగ్జిబిషన్, దుకాణాల ఏర్పాటు వంటి వాటిని రద్దు చేసినట్లు దర్గా నిర్వాహకులు తెలిపారు. ఏకాంత సేవలో దర్గా ఉర్సు ఉత్సవాలు జరుపుతున్నారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

