Shanti Ashramam: పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యం తమ లక్ష్యం: శాంతి ఆశ్రమం ట్రస్ట్
Shanti Ashramam: అర్హులైన పేదవారికి ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ట్రస్ట్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని శాంతి ఆశ్రమం ట్రస్ట్ ...

(Shanti Ashramam) కర్నూలు: అర్హులైన పేదవారికి ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందించేందుకు తమ ట్రస్ట్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందని శాంతి ఆశ్రమం ట్రస్ట్ వ్యవస్థాపకులు హిమాలయ గురూజీ తెలిపారు. ఈ లక్ష్యంతో గౌరీ గోపాల్ దవాఖాన సమీపంలోని ఉడ్‌ల్యాండ్స్ కాంప్లెక్స్‌లో పాలీ క్లినిక్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. రోగులకు ఒక్క రూపాయికే వైద్యం అందుతుందని హిమాలయ గురూజీ పేర్కొన్నారు. ప్రస్తుత రోజుల్లో వైద్యం ఖరీదైనదిగా మారిందని విచారం వ్యక్తం చేశారు. దాంతో పేదలు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు వెళ్లి ఖరీదైన చికిత్సను భరించే స్థితిలో లేరని విచారం వ్యక్తం చేశారు.
పేదల కష్టాలను అధ్యయనం చేసిన శాంతి ఆశ్రమం ట్రస్ట్.. ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. అర్హులైన ప్రతి పేదకు శాంతి పాలీ క్లినిక్‌లో ఉచితంగా వైద్యం పొందవచ్చునన్నారు. ఎవరైనా పేరు నమోదు చేసుకోవడానికి ఒక్క రూపాయి చెల్లిస్తే సరిపోతుందని హిమాలయ గురూజీ తెలిపారు. ట్రస్ట్ గతంలో ప్రభుత్వ పాఠశాలలు, మహిళల కోసం కేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని అందించింది. అర్హులైన పేదలు శాంతి ఆశ్రమ పాలీ క్లినిక్ సేవలను వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని గురూజీ కోరారు.
ఇవి కూడా చదవండి..
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

