(Olive Keelback snake) ప్రకాశం: అరుదుగా కనిపించే ఆలీవ్ కీల్ బాక్ స్నేక్ ప్రకాశం జిల్లా మార్కాపురంలో కనిపించింది. స్థానికంగా ఉన్న అటవీ శాఖ కార్యాలయంలోనే ఈ పాము ప్రత్యక్షం కావడంతో.. అప్రమత్తమైన సిబ్బంది దానిని పట్టుకుని నల్లమల అడవిలో వదిలిపెట్టారు.
నల్లమల అటవీ ప్రాంతానికి సమీపాన ఉన్న మార్కాపురంలో అరుదైన పాము కనిపించింది. చాలా అరుదుగా ఉండే ఆలీవ్ కీల్ బాక్ స్నేక్ మార్కాపురం అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యక్షమైంది. అప్రమత్తమైన అటవీశాఖ సిబ్బంది దాన్ని పట్టుకున్నారని డీఎఫ్ఓ అప్పావ్ విఘ్నేశ్ తెలిపారు. పాముని రెస్క్యూ టీం సభ్యులు నల్లమల అడవిలో వదిలినట్లు చెప్పారు. ఈ పాము అటవీ శాఖ కార్యాలయంలోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ పాము.. మైదాన ప్రాంతాల్లోకి రావడం అరుదు. ఈ పాము ప్రమాదకరం కాదని అధికారులు చెప్తున్నారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..