(Gas cylinder lorry) ప్రకాశం : వేగంగా వెళ్తున్న గ్యాస్ బండల లారీ ఒకటి బోల్తా పడటంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఎలా ఉండేదో అంటూ స్థానికులు భయపడిపోతున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న లారీ ఒకటి బోల్తా పడింది. దాంతో లారీలోని సిలిండర్లన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. అయితే, గ్యాస్ లీకేజీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ లారీ కడప నుంచి గ్యాస్ సిలిండర్ల లోడుతో వస్తుండగా.. బల్లిపల్లి వద్ద కల్వర్టును ఢీకొట్టింది. కనిగిరి-పామూరు ప్రధాన రహదారిపై సిలిండర్లన్నీ రోడ్డుపై ఉన్న గుంతలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. రోడ్డుపై గ్యాస్ సిలిండర్లు చెల్లాచెదురుగా పడి ఉండడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..