Abhishek Sharma : టీ20ల్లో నంబర్ 1 బ్యాటర్.. ఇంకేముంది వరల్డ్‌కప్‌లో వీరకొట్టుడుతో వైరలవుతాడు.. భారత జట్టు మూడో కప్పు విజయంలో అభిషేక్ శర్మ (Abhishek Sharma) కీలకమవుతాడని సెలెక్టర్లే కాదు అభిమానులూ అనుకున్నారు. కానీ, సీన్ రివర్సవుతోంది. టీమిండియాకు ప్రధాన బలంగా ఎదిగిన అతడే ఇప్పుడు ప్రధాన బలహీనతగా మారాడు. అవును.. ఏడాది కాలంగా నిలకడగా రాణించిన అభిషేక్ మెగాటోర్నీలో మాత్రం డకౌట్లతో వార్తల్లో నిలుస్తున్నాడు. పవర్ హిట్టర్‌గా జట్టుకు శుభారంభం ఇస్తాడనుకుంటే.. పేలవ షాట్లతో వికెట్ ఇచ్చేసి మిగతా వారిపై ఒత్తిడి పెంచుతున్నాడు. అమెరికాపై తొలి ఓవర్లోనే ఔటైన అభిషేక్.. పాక్‌పై, నెదర్లాండ్స్‌పైనా సున్నా చుట్టేశాడు. లీగ్ దశలో సరే.. కీలకమైన నాకౌట్ దశలో ఈ డేరింగ్ బ్యాటర్ ఇలానే ఆడితే విజయావక
స్వదేశంలో పొట్టి ప్రపంచకప్ ఆడుతున్న భారత జట్టు ఓపెనర్ అభిషేక్ శర్మపై కొండంత నమ్మకం పెట్టుకుంది. 200లకు పైగా స్ట్రయిక్ రేటుతో రెచ్చిపోయే ఈ చిచ్చరపిడుగు చెలరేగితే.. ప్రత్యర్థిని సగం దెబ్బతీసేయొచ్చు అని సూర్యకుమార్ సేన భావించింది. ఏమైందో తెలియదు.. మెగాటోర్నీలో మాత్ర మనోడు వరుసగా సున్నాలు చుట్టేస్తున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ గమనాన్ని మార్చగల ఈ డాషింగ్ బ్యాటర్ తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరుతున్నాడు. వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌గా ప్రపంచకప్‌లో ఆడుతున్న అతడు.. మూడు డకౌట్లతో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ ఏడాది ఏకంగా ఐదుసార్లు అతడు ఖాతా తెరవలేదు. ఒక క్యాలండర్ ఇయర్లో అత్యధిక డకౌట్ల(ఆరు పర్యాయాలు)తో పాక్ ఓపెనర్ సయీం ఆయూబ్ ముందున్నాడు.
3 Ducks in 3 T20 World Cup Matches, What’s your one piece of advice for Abhishek Sharma 🧐 pic.twitter.com/ICqiavsrgV
— Richard Kettleborough (@RichKettle07) February 18, 2026
సన్నాహక సిరీస్‌లో న్యూజిలాండ్‌పై సెంచరీతో ఇషాన్ కిషన్(Ishan Kishan).. వరుస అర్ధ శతకాలతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ చాటుకున్నారు. అయినా.. అభిషేక్ శర్మపై ఎవరికీ కించిత్ అనుమానం కూడా లేదు. ‘మనోడు ఇరగదీస్తాడు.. తొలి ఓవర్ నుంచే ఊచకోతతో ప్రత్యర్ధిని ఒత్తిడిలో పడేస్తాడు అనుకున్నారు’ అభిమానులు. కానీ.. అంచనా తప్పింది. లీగ్ దశలో మూడు మ్యాచుల్లోనూ అభిషేక్ బ్యాట్ నుంచి ఒక్కటటే ఒక్క పరుగూ రాలేదు. డేంజరస్ బ్యాటర్ కావడంతో ప్రత్యర్థి బౌలర్లు అతడి వికెట్‌పై గురి పెట్టడం మామూలే. కానీ, అభిషేక్ మాత్రం.. తన స్టయిల్ మార్చుకోవడం లేదు. తొలి బంతికే బౌండరీ బాది బౌలర్‌పై పైచేయి సాధించాలనుకునే తత్వం మంచిదే. కానీ.. వరల్డ్‌కప్‌లో అది బెడిసికొడుతోంది. ఫలితంగా.. నంబర్ 1 టీ20 బ్యాటర్ వరుసగా మూడు మ్యాచుల్లో డకౌటయ్యాడు.
యూఎస్ఏతో మ్యాచ్‌లో వసీం ఖాన్ పక్కా ప్లాన్‌తో అభిషేక్‌ను ఔట్ చేయగా.. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది భారత్. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా సైతం అభిషేక్‌ను ఊరించి బోల్తా కొట్టించాడు. అతడు ఔటైనా.. ఇషాన్ విధ్వంసక ఆటతో పాక్ బౌలర్లను వణికించాడు. ఒకవేళ ఇషాన్ అర్ధశతకం బాదకుంటే టీమిండియా కష్టాల్లో పడేది. చివరి లీగ్ మ్యాచ్‌తోనైనా ఫామ్‌లోకి వస్తాడనుకుంటే.. డచ్ జట్టుపై బౌల్డయ్యాడు అభిషేక్.
నెదర్లాండ్స్ పేసర్ ఆర్యన్ దత్ ఏకంగా బౌల్డ్ చేసి తొలి ఓవర్లోనే వికెట్ సాధించాడు. దూకుడే మంత్రగా ఆడే ఈ లెఫ్ట్ హ్యాండర్.. ఇషాన్ కిషన్‌లా బంతిని అంచనా వేసి ఆడితే మంచిదని మాజీలు సూచిస్తున్నారు. పాక్‌పై ఇషాన్ ఆడిన ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితాన్ని శాసించింది. అలానే.. అభిషేక్ కూడా ఆడితే నాకౌట్లో భారత్‌కు ఎదురుండదు. కానీ.. వరుస వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటే మంచిది. లేదంటే.. ఉప్పెనలా దూసుకొచ్చిన అతడు.. అంతే వేగంగా జట్టుకు దూరమయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం.
Abhishek Sharma now has the joint-most ducks in a calendar year for India in T20Is (5), alongside as many for Sanju Samson in 2024#T20WorldCup https://t.co/vJIjYudmE8
— Cricbuzz (@cricbuzz) February 18, 2026
ఆసియా కప్‌లో సంచలన ఆటతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్న అభిషేక్ శర్మ.. ప్రపంచకప్ ఆడాలనేది నా కల అని చెప్పడం మనందరికి తెలుసు. అతడు కలగన్నట్టే తొలిసారి పొట్టి వరల్డ్‌కప్‌లో ఆడే సువర్ణావకాశం వచ్చింది. ఇక బాదుడే బాకీ అనుకున్న అభిషేక్ .. తీరా మైదానంలో మాత్రం నిరాశపరుస్తున్నాడు. సూపర్ 18లో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వేతో భారత జట్టు తలపడనుంది. మూడింటా మూడు.. లేదంటే రెండు గెలిస్తేనే సెమీస్ చేరుతుంది. సో.. బిగ్ గన్ అభిషేక్ ఫామ్‌లోకి రావాల్సిన టైమ్ వచ్చేసింది.