(AP High Court) అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అదనపు భవన నిర్మాణం పనులకు సోమవారం శంకుస్థాపన పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా భూమిపూజ చేశారు. ఉదయం 9.05 గంటలకు శాస్త్రోక్తంగా భూమిపూజ చేపట్టారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ అధికారులు, ప్రభుత్వ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం ఉన్న భవనం కోర్టు విధుల నిర్వహణకు సరిపోకపోవడం లేదు. దాంతో ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనానికి ఎదురుగా అదనపు భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. అదనపు భవనం జీ+ 5 సామర్థ్యంతో నిర్మించనున్నారు. నిర్మాణ ప్రణాళిక, ఇతర విషయాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు ఇతర న్యాయమూర్తులకు ఉన్నతాధికారులు వివరించారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..