(Bus driver died) విజయవాడ నగరంలో విషాదం చోటుచేసుకున్నది. స్కూల్ బస్సు నడుపుతున్న ఓ డ్రైవర్.. గుండెపోటుతో మరణించాడు. బస్సులో చిన్నారులు ఎవరూ లేకపోవడంతో పోలీసులు, స్థానిక జనం ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన బెంజి సర్కిల్ ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది.
విజయవాడ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్ ప్రాంతంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్‌కు బస్సు నడుపుతుండగా గుండెపోటు వచ్చింది. దాంతో డ్రైవర్ స్టీరింగ్‌పైనే తలవాల్చి మృతి చెందాడు. బస్సు నలంద విద్యాసంస్థలకు చెందినదని, డ్రైవర్‌ను సాంబయ్యగా గుర్తించారు. తీవ్ర గుండెపోటు రావడంతో బస్సును రోడ్డు పక్కగా తీసుకెళ్లి నిలిపాడు. మరుక్షణమే స్టీరింగ్‌పై కుప్పకూలిపోయాడు. స్ట్రీరింగ్పై డ్రైవర్ పడి ఉండటాన్ని గమనించిన పోలీసులు రంగంలోకి దిగి ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..