Vishnu Vinyasam | కథను నమ్మి సినిమాలు చేస్తూ.. ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించే పనిలో బిజీగా ఉన్న యాక్టర్లలో ముందు వరుసలో ఉంటాడు శ్రీ విష్ణు (Sree Vishnu). విలక్షణమైన పాత్రలతో ఇంప్రెస్ చేసే శ్రీ విష్ణు తాజాగా ‘విష్ణు విన్యాసం’ (Vishnu Vinyasam) మూవీ చేస్తున్నాడని తెలిసిందే. క సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నయన్ సారిక హీరోయిన్గా నటిస్తుంది.
కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్నఈ మూవీ టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఒంగోలు నేపథ్యంలో ఉండబోతున్న ఈ చిత్రంలో శ్రీ విష్ణు ‘చిన్నూ’ అనే పాత్రలో కనిపించనున్నాడు. జాతకాలు, వాస్తుపై విపరీతమైన నమ్మకంతో శ్రీ విష్ణు చేసే పనులు, దాని చుట్టూ తిరిగే ఎలిమెంట్స్ నేపథ్యంలో సాగే టీజర్లో శ్రీ విష్ణు యాస, డైలాగ్స్ మూవీ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఈ చిత్రాన్ని ముందుగా ఫిబ్రవరి 28,2026న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారని తెలిసిందే. అయితే ఒక రోజు ముందుగానే సినిమా రాబోతుంది. జాతకం ప్రకారం… ఈ ఫిబ్రవరి 27 నుంచి థియేటర్లలో నవ్వుల వర్షం కురుస్తుంది. మీ జాతకంలో నాన్ స్టాప్ ఫన్ దోషం మొదలవుతుంది..అంటూ మేకర్స్ నయా రిలీజ్ అప్డేట్ షేర్ చేశారు.
ఈ చిత్రానికి రాధన్ సంగీతాన్ని అందిస్తుండగా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి నిర్మిస్తున్నారు. శ్రీ విష్ణు నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ ఫిబ్రవరి 27న రిలీజ్ కావాల్సి ఉండగా.. మార్చి 6కు విడుదల వాయిదా పడ్డది.
జాతకం ప్రకారం…
ఈ 27th FEBRUARY నుంచి థియేటర్లలో నవ్వుల వర్షం కురుస్తుంది 🤗🤗🤗మీ జాతకంలో “Non-Stop Fun Dosham” మొదలవుతుంది 😌#VishnuVinyasam in cinemas a day early, 27th FEB with lot of fun 🩶🩶🩶 pic.twitter.com/ZjppUdljIN
— Sree Vishnu (@sreevishnuoffl) February 21, 2026