Anthropic | ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ కొత్త ఫీచర్ ప్రకటన.. సైబర్ సెక్యూరిటీ షేర్లు ఢమాల్..!
Anthropic | అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) వరుస సంచలనాలు సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పోస్ట్‌తో సైబర్ సెక్యూరిటీ (Cyber Security) షేర్లు కుప్పకూలాయి. అమెరికా మార్కెట్లో ఆయా కంపెనీల స్టాక్స్ భారీగా పతనమయ్యాయి.
Anthropic : అగ్రరాజ్యం అమెరికా (USA) కు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్ (Anthropic) వరుస సంచలనాలు సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆ సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన పోస్ట్‌తో సైబర్ సెక్యూరిటీ (Cyber Security) షేర్లు కుప్పకూలాయి. అమెరికా మార్కెట్లో ఆయా కంపెనీల స్టాక్స్ భారీగా పతనమయ్యాయి.
సైబర్ సెక్యూరిటీ కోసం ఆంథ్రోపిక్ కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ని ప్రకటించింది. ఈ క్లాడ్కోడ్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ కోడ్‌బేస్‌లను స్కాన్ చేస్తుంది. అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దేందుకు పరిష్కారాలను సిఫార్సు చేస్తుంది. దాంతో కోడింగ్ ప్రాసెస్‌లోనే డెవలపర్లు భద్రతాపరమైన లోపాలను గుర్తించి, పరిష్కరించుకోవడానికి వీలు కలుగుతుంది.
సంప్రదాయ పద్ధతుల్లో గుర్తించని లోపాలను కనుగొనేందుకు ఈ టూల్ ఉపయోగపడుతుందని ఆంథ్రోపిక్ వెల్లడించింది. ఈ ఏఐ ఆధారిత ఫీచర్ ప్రస్తుతం పరిశీలన దశలో ఉంది. ఆంథ్రోపిక్ పోస్టుతో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు 5 శాతం నుంచి 9 శాతం మేర పతనమయ్యాయి. సైబర్సెక్యూరిటీతో సంబంధం ఉన్న సాఫ్ట్వేర్ సంస్థలైన గిట్‌ల్యాబ్, జెఫ్రాగ్ షేర్లు కూడా పడిపోయాయి. గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ 5 శాతం పతనమైంది. మొత్తంగా మదుపర్ల సంపద 10 బిలియన్ డాలర్ల మేర ఆవిరైందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

