రాజాపేట, ఫిబ్రవరి 21 : రాష్ట్రంలో దుర్మార్గపు దౌర్జన్య పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ రాజాపేట మండలాధ్యక్షుడు సట్టు తిరుమలేశ్ అన్నారు. శనివారం రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై నిలదీస్తున్నాడనే కక్షతోనే బాల్క సుమన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడం దుర్మార్గపు చర్య అన్నారు. బాల్కన్ సుమన్‌పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేసి బేషరతుగా జైలు నుండి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు గుంటి మధుసూదన్ రెడ్డి, ఎర్రగోకుల జశ్వంత్, అంకతి సుదర్శన్, సోమలింగం గుప్తా, కిషన్ పాల్గొన్నారు.