(Government Jobs) కేంద్ర ప్రభుత్వం ఆజమాషీలో నడుస్తున్న నేషనల్ హౌజింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) లో ఉద్యోగాల భర్తీకి గడువు సమీపిస్తున్నది. ఈ బ్యాంకులో ఖాళీగా ఉన్న దాదాపు 17 ఉద్యోగాలకు దరఖాస్తులను దాఖలు చేసేందుకు తుది గడువు ఈ నెల 30. తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు నేషనల్ హౌజింగ్ బ్యాంక్ వెబ్సైట్లో అన్లైన్లో దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (ఎన్‌హెచ్‌బీ) నోటిఫికేషన్లో తెలిపిన వివరాల ప్రకారం, అసిస్టెంట్ మేనేజర్ (ఏఎం), డిప్యూటీ మేనేజర్ (డీఎం), రీజినల్ మేనేజర్ (ఆర్ఎం) ఉద్యోగాల ఖాళీలు 17 ఉన్నాయి. ఈ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభమైంది. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 30 లోపు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడం ద్వారా రిక్రూట్మెంట్లో చేరవచ్చు. బ్యాంక్ నిర్వహించే రిక్రూట్మెంట్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://nhb.org.in ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
వెబ్సైట్ హోమ్ పేజీలోని రిక్రూట్మెంట్ విభాగంలో నోటిఫికేషన్‌ను చూసేందుకు, దరఖాస్తు ఫారంను పూరించేందుకు లింక్ ఉంటుంది.
వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం మీరు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
కొవాగ్జిన్.. కొవీషీల్డ్.. వీటిలో బూస్టర్ డోస్‌గా ఏ వ్యాక్సిన్ వేసుకుంటే మంచిది?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
పిల్లలు ఎందుకు ఏడుస్తారు? వాళ్లు ఏడుపు ఆపాలంటే ఏం చేయాలి?
ఇండియన్ లుక్‌లో అదరగొట్టిన హర్నాజ్ సంధూ.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..