(Misbehave with devotees) కర్నూలు : మహిళా భక్తుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని భక్తులు చితకబాదారు. కాలకృత్యాలకు వెళ్లే మహిళలను ఫొటోలు తీయడంపై మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువకుడు మరుగుదొడ్డి నిర్వాహకుడిగా ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సదరు యువకుడితో క్షమాపణలు చెప్పించి ఫొటోలను తొలగించివేశారు.
వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా మహానందీశ్వరుని దర్శించుకునేందుకు తాడిపత్రి నుంచి పలువురు భక్తులు మహానందికి వచ్చారు. కాలకృత్యాలు తీర్చుకుంటున్న మహిళల ఫొటోలు తీయడంతో వివాదం చెలరేగింది. తమ యజమాని ఫొటోలు తీయాలని తనను ఆదేశించడం వల్లనే ఈ పని చేశానని చెప్పుకొచ్చాడు. దాంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు యువకుడిని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్కు తరలించారు. మరుగుదొడ్డి నిర్వాహకులను పిలిపించాలని భక్తులు కోరారు. ఆ యువకుడితో క్షమాపణలు చెప్పించిన పోలీసులు.. యువకుడు తీసిన ఫొటోలను తొలగించి వేశారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..