Nilave Movie | చిన్న చిత్రంగా విడుదలై, బాక్సాఫీస్ వద్ద ‘సైలెంట్ హిట్’గా నిలిచిన చిత్రం ‘నిలవే’. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో చిత్ర యూనిట్ ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
ప్రముఖుల ప్రశంసల జల్లు
ఆస్కార్ విజేత, ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ వీడియో సందేశం ద్వారా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘నిలవే’ ఒక బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలవడం సంతోషకరమని ఆయన కొనియాడారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. “ఈ వాలెంటైన్స్ డేకి విడుదలైన సినిమాల్లో ‘నిలవే’ డీసెంట్ కలెక్షన్లతో సక్సెస్ఫుల్ టాక్ తెచ్చుకుంది. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు భవిష్యత్తులో సూపర్ స్టార్లు అవుతారు” అని ప్రశంసించారు.
నటుడు జెమిని సురేష్ ఈ చిత్రాన్ని ఆకాశానికెత్తారు. “చాలా రోజుల తర్వాత మనసుకు హత్తుకునే సినిమా చూశాను. బాపు గారి బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలా ఉంది. ఇది నేటి జనరేషన్ ‘గీతాంజలి’. మా కరీంనగర్ కుర్రాడు సౌమిత్ ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు” అని హర్షం వ్యక్తం చేశారు.
మా ‘బాహుబలి’ ఇదే: హీరో సౌమిత్ పోలాడి
హీరో సౌమిత్ మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “మూడేళ్ల కష్టమే ఈ సినిమా. రాజమౌళి గారు ‘బాహుబలి’ కోసం ఎంత శ్రమించారో, మా స్థాయికి మా ‘నిలవే’ మాకు అంతటి బాహుబలి లాంటిది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కాంప్రమైజ్ కాకుండా సినిమా తీశాం. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే మా కష్టం మర్చిపోతున్నాం” అని అన్నారు.
మేకర్స్ మాటల్లో..
దర్శకుడు సాయి కే వెన్నం: “ప్యూర్ ఇంటెన్షన్‌తో సినిమా తీస్తే విజయం కచ్చితంగా వస్తుందని ఈ చిత్రం నిరూపించింది. టీమ్ సపోర్ట్ వల్లే ఈ సక్సెస్ సాధ్యమైంది.”
హీరోయిన్ శ్రేయాసి సేన్: “ప్రీతి పాత్రలో నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు, మొదటి సినిమాకే ఇంతటి ఆదరణ అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు.”
నిర్మాత రాజ్ అల్లాడ & మాధూరి: “కొత్త వాళ్లు తీసిన సినిమా అని ఎవరూ అనట్లేదు, అంత క్వాలిటీగా ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.”
సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్: “ప్రేక్షకులు ఇచ్చిన ఈ సక్సెస్ మా కష్టానికి దక్కిన ప్రతిఫలం.”
ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ ఎ ట్రావెల్స్ అనురాధా, అనిల్ కడియాల, నటుడు రూపేష్ తదితరులు పాల్గొని చిత్ర విజయంపై ఆనందం వ్యక్తం చేశారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా కీలక పాత్రల్లో నటించారు.
తారాగణం: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్ తదితరులు.
సాంకేతిక నిపుణులు:
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం
దర్శకత్వం: సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కే కుమార్
ఎడిటర్: సత్య.జి
పీఆర్ఓ: జీకే మీడియా (గణేష్, కుమార్)