“ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత” అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి పై నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్ రెడ్డికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. “ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?” అని అడిగిన సన్నాసికి ఇవన్నీ చెప్తా ఉన్నా. తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి. మాది ఫైటర్ల జాతి, మీది ట్రెయిటర్ల (ద్రోహుల) జాతి. మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది మరి ట్రెయిటర్ల జాతి’గుర్తుపెట్టుకో.. కేసీఆర్ ఎన్నడూ చెప్పుకోలేదు నేను జాతిపితనని. ప్రజలు పిలుచుకున్నారు. ఎవరైతే స్వాతంత్ర్యం తెచ్చిండో తమ జాతికి, ఆయనను జాతిపితగా ప్రజలు పిలుచుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఆనవాళ్లు ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి..?
పెద్దమనిషి, మా తెలంగాణకు బాపు లాంటి పెద్దమనిషి కాబట్టే ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం సర్వసాధారణంగా ఏ తండ్రి అయినా ఆ కొడుకుకు, ఆ పిల్లలకు హీరోగా ఉంటారు. కానీ నా తండ్రి ఇవాళ తెలంగాణకు హీరో, అది తెలంగాణ జాతికి మొత్తానికి హీరో. ఇది వాస్తవం. కొంతమంది మాట్లాడుతున్నారు ఆనవాళ్లు చెరిపేస్తామని. కేసీఆర్ జన్మదిన సందర్భంగా నేను చెప్తా ఉన్నా తెలంగాణనే కేసీఆర్ ఆనవాళ్లు కదా..! తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్లు కదా..! దాన్ని ఎట్లా చెరిపేస్తావురా సన్నాసి..? నువ్వు మమ్మల్ని ఎన్ని తిట్టినా, ఎన్ని బూతులు మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవం.. ఆయన ఒక శిఖరం, నువ్వు ఒక శునకం. నీ స్థాయి గదే, నీ బతుకు గదే. అందుకే నీకంటే ఇవాళ తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు తెలుసనన్నారు.
“ఏ జాతి నీది? ఏ జాతికి జాతిపిత?” అని అడిగిన సన్నాసికి చెప్తున్నా..
తెలంగాణలో రెండే జాతులు ఉన్నాయి..
ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి.మాది కేసీఆర్ లాంటి ఫైటర్ల జాతి, నీది ట్రెయిటర్ల జాతి.
– బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/H8y03X7veQ
— BRS Party (@BRSparty) February 17, 2026