Etthara Etthu | టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కామ్రేడ్ కళ్యాణ్’ (Comrade Kalyan). జానకిరామ్ మారెల్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి మూడో సింగిల్ అయిన ఎత్తర ఎత్తు (Etthara Etthu) లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యమందించగా, నల్గొండ గద్దర్ నర్సన్న ఆలపించారు. బాలు.ఎస్ కీస్ ప్రోగ్రామింగ్, లక్ష్మీనారాయణ టీమ్ లైవ్ రిథమ్స్, రాబిన్ సెబాస్టియన్ గిటార్ అండ్ బాస్ అందించగా, బాలు.ఎస్ మిక్స్ అండ్ మాస్టరింగ్ చేశారు. ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా.. రాధికా శరత్‌కుమార్, షైన్ టోమ్ చాకో, ఉపేంద్ర లీమాయ్ తదితరులు కీలక పాత్రల్లో పోషిస్తున్నారు. కోన వెంకట్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై వెంకట కృష్ణ కర్ణాటి, సీత కర్ణాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.