KCR Birthday | కేసీఆర్.. కేవలం తెలంగాణ సాధించిన ఉద్యమకారుడిగానో… తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగానో మాత్రమే గుర్తుంచుకుంటే సరిపోయే వ్యక్తిత్వం కాదు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ జాతీయ స్థాయిలో సమున్నతంగా నిలిపిన అభినవ శిల్పి. పారిశ్రామికంగా, సామాజికంగా రాష్ట్రాన్ని ముందుకు నడపడమే కాకుండా పర్యావరణపరంగా తెలంగాణలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలని భావించి అధికారంలో ఉన్నపుడు అవిశ్రాంతంగా శ్రమించిన హరిత కార్మికుడు. రాష్ట్రంలో కోట్లాది మొక్కలు నాటినుంచి హరిత తెలంగాణ అనే ట్యాగ్ లైన్ సాధించిన ప్రకృతి ఆరాధకుడు అయన. పంచాయతీల్లో సైతం పార్కులు నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా.. రాష్ట్రంలో మొక్కల సంఖ్యను అమాంతం పెంచి తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉందీ అంటే అదిగో ఆ పచ్చని మొక్కలు.. చెట్ల మాటున చల్లగా వర్ధిల్లుతోంది అని యావత్ దేశం చెప్పుకునేలా చేసారు.
ఇక ఇదే క్రమంలో ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం సందర్భంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి అందరిలోనూ పర్యావరణంపై మక్కువ కలిగేలా చేస్తున్నారు. ఈ సారి గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా నదుల పరీవాహకంలో ఉన్న సుందర్ బన్ డెల్టా ప్రాంతంలో కేసీఆర్ జన్మ దినం సందర్భంగా పదివేల మ్యాన్గ్రూవ్ మొక్కలు నాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ నాయకత్వంలో ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ పాలనలో పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ ప్రధాన విధుల్లో ఒకటిగా మారింది. రాష్ట్రంలో కోట్లాది కొత్త మొక్కలు మొలకెత్తి అవిప్పుడు చెట్లు.. వృక్షాలుగా మారాయి. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ కేవలం విధానాలనే కాకుండా, రాష్ట్ర అభివృద్ధి తత్వాన్నే రూపకల్పన చేసే బాధ్యతను వహించారు. ఆయన నాయకత్వంలో హరిత హారం దీర్ఘకాలిక పర్యావరణ సవరణగా రూపుదిద్దుకుంది.
దేశమంతటికి పాకిన హరిత ఉద్యమం..
కొత్త రాష్ట్ర పునాదులు పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలన్న స్పష్టమైన సంకల్పంతో అడవుల విస్తీర్ణం పెంచడం, భూగర్భజలాలను పునరుద్ధరించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, వాతావరణ సహనశక్తిని తెలంగాణ అభివృద్ధి పథంలో భాగం చేయడం వంటి లక్ష్యాలతో ముందుకు సాగారు.
తెలంగాణ నుంచి దేశమంతటికి పాకిన హరిత ఉద్యమం. హరితహారం గొప్పతనం తెలంగాణలో వచ్చిన ఫలితాలతోనే కాదు, రాష్ట్ర సరిహద్దులను దాటి ప్రేరణనివ్వడంలో ఉంది. సంతోష్ కుమార్ ఆలోచనల్లోంచి జన్మించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఉద్యమం.. దేశంలోనే ఈ అంశంలో గొప్ప ముందడుగు వేసింది. 2018లో మొదలైన ఈ పర్యావరణ ఉద్యమం కోట్లాది విత్తనాలను అడవుల్లో నాటింది. యువత, విద్యార్థులతో మమేకమై కోట్లాది మొక్కలకు ప్రాణం పోసింది. ఈ ఉద్యమంలో యువత, ప్రజాప్రతినిధులు, ప్రయివేటు సంస్థలు, కార్పొరేట్లు, పౌర సమాజాన్ని సైతం భాగస్వాములను చేసి ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
పదివేల మొక్కలు నాటే ప్రక్రియ..
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 195 మిలియన్ మొక్కలు నాటడంతోబాటు 20,000కు పైగా జలవనరులకు పునరుజ్జీవం కలిగించడం గొప్ప మేలిమలుపు అయింది. ఇక ఇప్పుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా డెల్టాలో సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుందర్బన్ అడవుల్లో పదివేల మొక్కలు నాటే ప్రక్రియ చేపట్టారు. ఈ మడ అడవులు తీరానికి గొప్ప రక్షణ కలిగిస్తూ గ్రీన్ ఆర్మ్ పాత్రను పోషిస్తున్నాయి.
తుఫాన్ల నుంచి తీరాన్ని కాపాడడం.. అలల తీవ్రతను అడ్డుకోవడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడంలో ఈ మడ అడవుల పాత్ర ఎనలేనిది. కానీ వరుస తుపానును, నేలలోకి ఉప్పునీరు ఇంకిపోయి నెల స్వభావాన్ని ప్రభావితం చేయడం.. అస్థిరమైన వర్షపాతం, ఐలా, అంఫాన్, యాస్, సిత్రాంగ్ వంటి తుఫాన్లు ఈ ప్రాంతాన్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. దీంతో మడ అడవుల మనుగడకు విఘాతం కలుగుతోంది. దీంతో ఈ అడవులకు మరింత శక్తిని కూడగట్టే ప్రక్రియకు కేసీఆర్ జన్మదినం ఒక ప్రత్యేక వేదికగా మారుతోంది.
తెలంగాణ వ్యవస్థాపకుడికి హరిత నివాళి..
ఫిబ్రవరి 17న, KCR 72వ పుట్టినరోజు సందర్భంగా, సుందర్బన్లలో మడ అడవుల్లో 10,000 మొక్కలు నాటడం జరిగింది. యువత విద్యార్థులు.. స్థానికుల సహకారంతో ఈ మొక్కలను సుందర్బన్ అడవుల్లో నాటి పర్యావరణాన్ని కాపాడే ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్న నినాదాన్ని దేశవ్యాప్తం చేస్తున్నాం. ఈ అడవులు తీరాన్ని కాపాడే విషయంలో ఎంత కీలకపాత్ర పోషిస్తున్నాయన్నది మనతోబాటు ముందుతరాలకు సైతం చేరవేయడం ఈ ఉద్యమ ఉద్దేశ్యం.. పర్యావరణ ప్రేమికులందరినీ ఒక చోట చేర్చి ఈ ప్రక్రియను ఘనంగా చేపట్టి కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తిని దెస వ్యాప్తం చేయడం మా లక్ష్యమని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ తెలిపారు.
20,000 mangrove saplings planted in the Sundarbans.
On the occasion of @KCRBRSPresident 72nd birthday, we have taken this green initiative in the Ganga–Brahmaputra–Meghna delta.From Telangana to the Nation, the message is clear
Protect nature, secure the future.
Mangroves… pic.twitter.com/3FwFXsEJLs— Santosh Kumar J (@SantoshKumarBRS) February 17, 2026