Muhammad Yunus | భారత్‌ను రెచ్చగొట్టేలా ‘7 సిస్టర్స్’పై ముహమ్మద్ యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు
Muhammad Yunus : ఇంతకాలం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనస్ ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తన పదవి నుంచి దిగిపోయే వేళ చేసిన ప్రసంగంలో ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ గురించి ప్రస్తావించాడు.
Muhammad Yunus : ఇంతకాలం బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా వ్యవహరించిన ముహమ్మద్ యూనస్ ఇండియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. తన పదవి నుంచి దిగిపోయే వేళ చేసిన ప్రసంగంలో ఇండియాలోని సెవెన్ సిస్టర్స్ గురించి ప్రస్తావించాడు. సెవెన్ సిస్టర్స్ ప్రత్యేక, స్వతంత్ర ప్రాంతం అనేలా వ్యాఖ్యలు చేశాడు. మంగళవారం ఢాకాలో యూనస్ తన వీడ్కోలు ప్రసంగం చేశాడు.
యూనస్ మాట్లాడుతూ ‘‘నేపాల్, భూటాన్, సెవెన్ సిస్టర్స్‌తో బంగ్లాదేశ్ గొప్ప ఆర్థిక సామర్ధ్యం కలిగి ఉంది. బంగ్లాదేశ్‌కు ఉన్న సముద్రాలు కేవలం సరిహద్దులే. ఈ సముద్రాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మార్గాలు మాత్రమే’’ అని వ్యాఖ్యానించాడు. నేపాల్, భూటాన్ దేశాలతోపాటు ఇండియాలోని సెవెన్ సిస్టర్స్‌ను ప్రత్యేకంగా పేర్కొనడంలో యూనస్ దురుద్దేశం స్పష్టంగా అర్థమవుతోంది. ఇండియాలోని ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్‌గా పేర్కొంటారు. అవి అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర. ఈ రాష్ట్రాల గురించి ప్రస్తావించేటప్పుడు యూనస్ ఇండియా అని పేర్కొనాల్సింది. కానీ, మన దేశాన్ని రెచ్చగొట్టేలా సెవెన్ సిస్టర్స్ అని మాత్రం చెప్పాడు. ఒకపక్క బంగ్లాదేశ్‌లో అంతర్యుద్ధాన్ని ఆపడంలో విఫలమైన యూనస్.. భారత్ గురించి ఇలా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు.
గతంలో కూడా ఆయన ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలే చేశాడు. సెవెన్ సిస్టర్స్ ప్రాంతాన్ని ల్యాండ్ లాక్డ్ ఏరియాగా పేర్కొన్నాడు. ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించాలని కోరాడు. మంగళవారం బంగ్లాదేశ్‌లో పూర్తిస్థాయి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ రోజు సాయంత్రం అక్కడ బీఎన్పీ తరఫున తారిఖ్ రహమాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- 7 Sisters
- bangladesh
- Delhi
- Dhaka
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

