High Level Bridge | మెదక్ రూరల్, ఫిబ్రవరి 17 : మెదక్ జిల్లా పరిధిలోని చిట్యాల, జానకంపల్లి సమీపంలో సుమారు 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన హైలెవెల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. అయితే వంతెనకు అనుసంధానంగా ఉండాల్సిన బీటీ రోడ్డు (అప్రోచ్ రోడ్) నిర్మాణం మాత్రం ఇప్పటికీ చేపట్టలేదు. దీంతో వాహనదారులు, గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ క్రమంలో పక్కనే ఉన్న మట్టి దారిలోనే ప్రయాణించడం ద్వారా ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ శాఖ ఏఈ శరత్ అధికారులను అడగగా.. బీటీ రోడ్డు పనులకు నిధులు మంజూరు కాలేదు. నిధులు వచ్చిన తర్వాత పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన బ్రిడ్జి, కేవలం అప్రోచ్ రోడ్డు లేక నిరుపయోగంగా మారడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
Veenavanka | వీణవంకలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో