Errabelli Dayakar Rao | పోలీసుల ఓవరాక్షన్.. కంట తడి పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి : వీడియో
మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections) కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నది.
హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో(Muncipal elections) కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నది. అధికారం అండ చేసుకొని నిర్లజ్జగా తప్పుడు కేసులు, అరెస్టులతో ప్రతిపక్షాలపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నది. అధికారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని దాష్టీకాలకు ఒడిగొడుతున్నది. తాజాగా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి దయాకర్ రావు( Errabelli Dayakar Rao ) కంటతడి పెట్టుకున్నారు. తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వియోగానికి పాల్పడుతున్నది. ఉద్రిక్తలు చోటు చేసుకుంటున్నాయనే కారణంతో అక్కడ నుంచి ఎర్రబెల్లిని నర్సింహులపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
విషయం తెలుసుక్ను బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయ పోలీసుస్టేషన్‌కు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంటతడి పెట్టుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేశారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రజాస్వామికంగా చైర్మన్‌ను ఎన్నుకున్నారు. తొర్రూరులోని తన కార్యాలయంలోకి వెళ్లనివ్వలేదన్నారు. 45 ఏండ్ల నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలను పూర్తిగా బ్రష్టుపట్టించారన్నారు. కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలింపు, మద్దతుగా పోలీసుస్టేషన్ కు చేరుకున్న మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్.
మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి… pic.twitter.com/RzsgENyf4J
— Telugu Scribe (@TeluguScribe) February 17, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

