Veenavanka | వీణవంక, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలిముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో మాజీ ఎంపీపీ, ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వీణవంక, హిమ్మత్‌నగర్‌లో కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ఎంపీపీ రాయిశెట్టి లత-శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు జడల రమేష్, దాసారపు సరోజన-రాజేంద్రప్రసాద్, కుమార్, సంపత్‌రెడ్డి, వీణవంక ఉపసర్పంచ్ తాళ్ళపెల్లి మహేశ్, మాజీ సర్పంచ్‌లు అడిగొప్పుల సత్యనారాయణ, పోతుల నర్సయ్య, జనార్ధన్‌రెడ్డి, మాజీ సింగిల్ విండో డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు భూమయ్య, పర్లపెల్లి తిరుపతి, తిరుపతిరెడ్డి, శరత్‌రెడ్డి, నాగరాజు, ఓదెలు, రాజయ్య, ఫసిమొద్దీన్, మహిపాల్‌రెడ్డి, గెల్లు కుమార్, నీల శ్రీకాంత్, ఆవుల శ్రీనివాస్, సంపత్‌రెడ్డి, కర్ణకంటి భాస్కర్‌రెడ్డి, గెల్లు రమేష్, ప్రకాశ్, రాజుకుమార్, నల్ల తిరుపతిరెడ్డి, లడె సంపత్ రావు, బాబురావు, తదితరులు పాల్గొన్నారు.