KU |తెలంగాణ అస్థిత్వ శిఖరం కేసీఆర్.. కేయూలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ర్ట సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను కేయూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ర్ట సాధకుడు కేసీఆర్ జన్మదిన వేడుకలను కేయూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ కేయూ ఇంచార్జి జెట్టి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ..రాష్ర్టం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను, 62 ఏళ్ల కలను సాకారం చేయడమే కాకుండా, తన ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ర్ట ముఖచిత్రాన్ని మార్చారని వారు గుర్తుచేశారు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ మౌలిక సదుపాయాల కల్పన, అద్భుతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని కొనియాడారు.
తెలంగాణ ప్రజల కలలు సాకారం కావాలంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీర్వాదంతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్చంద్ర, యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నాయకులు కందికొండ తిరుపతి, గొల్లపల్లి వీరు, పిన్నింటి విజయ్కుమార్, పస్తం అనిల్, మహేష్, ఇస్మాయిల్, కార్తీక్, నల్లతీగల శ్రీకాంత్, సాయికుమార్, శివ, సాయి, వేణు, అఖిల్, అజయ్, పవన్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- BRSV
- KCR Birthday
- ku
- Telangana News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

