(SBI staff fraud) నెల్లూరు: ఎస్బీఐలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఎఫ్‌డీల నుంచి నగదు మాయమవుతుంది. గత కొన్నేండ్లుగా ఈ మాయ కొనసాగుతున్నా.. విషయం మాత్రం ఖాతాదారులకు తెలియడం లేదు. అయితే, చిన్న మెసేజ్‌తో ఆ ఇంటి దొంగ నిర్వాకం బట్టబయలైంది.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎస్బీఐ బ్రాంచ్‌లో షేక్ రబ్బానీ క్లర్‌గా పనిచేస్తున్నాడు. రబ్బానీ తన తల్లి, తమ్ముడు, స్నేహితుడి ఖాతాలను రాపూరు బ్రాంచ్ నుంచి వెంకటగిరి బ్రాంచ్‌కి మార్చుకున్నాడు. బ్యాంక్ లొసుగులను తెలుసుకున్న రబ్బానీ.. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన అకౌంట్ల నుంచి రూ. 6 లక్షలు, రూ.3.22 లక్షల లోన్ తీసుకున్నాడు. ఇటీవల బ్యాంకుకు వచ్చిన ఒక ఖాతాదారుడికి యాప్ ద్వారా రబ్బానీనే ఎఫ్డీ చేయించాడు. ఈ ఎఫ్డీపై రూ.1.35 లక్షలు లోన్ తీసుకున్నాడు. ఇటీవల ఈఎంఐ చెల్లించాలంటూ ఖాతాదారుడికి మెసెజ్ వచ్చింది. దాంతో కంగారుపడిన ఖాతాదారుడు వెంటనే బ్యాంక్ మేనేజర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన బ్యాంకు మేనేజర్.. ఇది ఇంటి దొంగ పనేనని గ్రహించి బ్యాంక్ విజిలెన్స్ విచారణకు కోరారు. కేసు విచారించిన వెంకటగిరి పోలీసులు రబ్బానీని నిందితుడి తేల్చి అరెస్టు చేశారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..