(Fit JNTU Run) అనంతపురం: జేఎన్టీయూ వజ్రోత్సవాలను పురస్కరించుకుని ‘ఫిట్ జేఎన్టీయూ 4కే రన్’ నిర్వహించారు. ఈ రన్‌ను జేఎన్టీయూ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ రంగా జనార్ధన్ ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు రన్లో పాల్గొన్నారు.
అనంతపురంలోని జేఎన్టీయూ 75వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని ‘ఫిట్ జేఎన్టీయూఏ 4కే రన్’ నిర్వహించారు. క్లాక్ టవర్లోని సుభాష్ రోడ్డు నుంచి కళాశాల వరకు 4కే రన్ చేపట్టారు. ఈ రన్లో మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై వెంకట రామి రెడ్డితోపాటు పలువురు అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఈ కళాశాల ఎంతో మంది ప్రముఖులను తయారు చేసిందని, వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని వై వెంకటరామిరెడ్డి గుర్తు చేసుకున్నారు. అత్యంత పురాతనమైన, ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ కీర్తిని దశదిశలా మరింత వ్యాప్తిచెందించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. విద్యార్థులు కేరింతలు కొడుతూ రన్లో పాల్గొన్నారు. వజ్రోత్సవాలు ఘనంగా ప్రారంభం కావడంపై అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..