Venezuela Earthquakes: 10 అంతస్తుల హోటల్ శిథిలం.. 164కు చేరిన భూకంప మృతుల సంఖ్య.. ఈ విషాదాన్ని వెనిజువెలా తట్టుకుంటుందా?
Venezuela Earthquakes: వెనిజువెలాలో సంభవించిన రెండు భారీ భూకంపాల వల్ల మృతిచెందిన వారి సంఖ్య 164కు చేరుకున్నట్లు ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగేజ్ తెలిపారు. ఇక లా గైరియా రాష్ట్రంలో ఉన్న ఓ 10 అంతస్తుల హోటల్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రస్తుతం అమెరికా గుత్తాధిపత్యంలో ఉన్న వెనిజువెలా ఈ పెను విషాదాన్ని ఎలా తట్టుకుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కారకాస్: వెనిజువెలాలో ఇవాళ ఒక్క నిమిషం తేడాతో రెండు భారీ భూకంపాలు(Venezuela Earthquakes) నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే లా గైరా రాష్ట్రంలో ఉన్న ఓ హోటల్ పేకమేడలా కూలింది. 10 అంతస్తులు ఉన్న ద హోటల్ ఎడువార్డ్.. భూకంప ధాటికి శిథిలమైంది. ఆ హోటల్ ముందు నుంచి భూకంపం తర్వాత ఓ బైకర్ తీసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. భూకంపం రాకముందు ఎలా ఆ హోటల్ ఉందో మరో పిక్‌లో చూడవచ్చు. అయితే 7.2, 7.5 తీవ్రతతో కేవలం 40 సెకన్ల తేడాతో వెనిజువెలాలో ఇవాళ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపాల వల్ల మృతుల సంఖ్య 164కు చేరినట్లు వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగేజ్ తెలిపారు.
🇻🇪 “Hotel Eduard’s” completamente destruido en La Guaira, esto es terrible 😭 pic.twitter.com/KX2xuym14t
— A. Guderian 🇪🇦🇪🇺🇺🇦 (@Anna_Guderian) June 25, 2026
ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మాడురోను జనవరిలో అమెరికా దళాలు బంధీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ దేశం అమెరికా ఆదేశాల ప్రకారమే నడుస్తోంది. తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగేజ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. అమెరికా కనుసన్నల్లోనే వెనిజువెలా భవిష్యత్తు నెలకొన్నది. అయితే తాజా భారీ భూకంపాల నేపథ్యంలో వెనిజువెలా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. భారీ స్థాయిలో విపత్తు చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ దేశం ఇంత విషాదాన్ని ఎలా తట్టుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. వెనిజువెలాలో ఉన్న ఇంధన నిక్షేపాలను నమ్ముకన్న అమెరికాకు.. ఇవాళ సంభవించిన భారీ భూకంపం ఓ గుణపాఠమే అవుతుంది.
వెనిజువెలాలో సరిపడా ఇంధనం ఉన్నా.. ఆ దేశం ప్రస్తుతం అమెరికా గుత్తాధిప్యంలో ఉన్నది. అమెరికా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉన్నది. అయితే వెనిజువెలా ఆయిల్ రెవన్యూపై పారదర్శకత లేదని అమెరికా ఆరోపిస్తోంది. వెనిజువెలా ఇంధన ఆదాయంపై మేనేజ్మెంట్ కానీ, ఆడిటింగ్ కానీ సరిగా లేదని అమెరికా గతంలో ఆరోపణలు చేసింది. అవినీతి, అక్రమాలతో నిండిన వెనిజువెలాను ఇప్పుడు ప్రకృతి దెబ్బతీసింది. కానీ ఇలాంటి డిజాస్టర్‌ను ఎదుర్కొనే రీతిలో వెనిజువెలా లేదని కొందరు నిపుణులు అంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
High Blood Pressure | రక్తపోటు అదుపులోకి రావడం లేదా? అసలు కారణాలు ఇవే..
Ranabaali | ‘రణబాలి’కి టికెట్ ధరలే ప్లస్ పాయింట్.. ‘జైలర్ 2’తో పోటీలో విజయ్ దేవరకొండకు కలిసొచ్చే అంశమిదే!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

