Nithiin | కేఎం అలియాస్ కృష్ణమోహన్, పూజా సుందర్ శెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఇట్స్ లైఫ్ బ్రో’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ప్రామిసింగ్ హీరో నితిన్ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కేఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కృష్ణ మోహన్ సల్లగుండ్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి సోమశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వైవిధ్యమైన కథ, కథనాలతో ఎమోషనల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతోందని దర్శకుడు తెలిపారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారు.
ఈ చిత్రంలో కృష్ణమోహన్, పూజా సుందర్ శెట్టితో పాటు రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, అంబటి శ్రీనివాస్, దేవి ప్రసాద్, కిరీటి, త్రిశూల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే ఇ.రాజయ్య అందించగా, చైతన్య సినిమాటోగ్రఫీ, సాహిత్య సాగర్ సంగీతం, సత్య గిద్దుటూరి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

Its My Life