(Jagan Review) విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు బయటకు రావడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నానితోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల్లో జీన్ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. రాష్ట్రంలో ఫీవర్ సర్వే కొనసాగిస్తామని.. ప్రభుత్వ దవాఖానల్లో నెలాఖరు కల్లా 144 పీఎస్ఏ ప్లాంట్లు అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ కేసు నమోదు కావడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇక నుంచి మరింత కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని అధికారులకు జగన్ ఆదేశించారు. వచ్చే నెలలోగా నిర్దేశిత వయస్సుల వారు అందరికీ డబుల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను సమర్థంగా వినియోగించుకొనేందుకు యాప్ను అందుబాటులోకి తేవాలని, ఈ యాప్ ద్వారా ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకొనేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని.. క్యాన్సర్ రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..