(AP police) కడప: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసుల్లో కూడా మార్పు కనిపిస్తున్నది. అటు ప్రజలకు సేవలు చేస్తూనే.. ఇటు ప్రజల ప్రాణాలను కాపాడటంలో వేగంగా స్పందిస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ యువకుడిని నిమిషాల్లోనే కాపాడి కడప జిల్లా ప్రొద్దటూరు పోలీసులు ప్రశంసలు అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని చౌటపల్లి గ్రామానికి చెందిన సుబ్బారాయుడు తన తల్లి చెన్నమ్మతో ఆదివారం సాయంత్రం చిన్న విషయమై వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సుబ్బారాయుడు పట్టరాని ఆవేశానికి గురయ్యాడు. తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్తూ ఇంట్లోకెళ్లి తలుపులేసుకున్నాడు. దాంతో ఆందోళనకు గురైన తల్లి చెన్నమ్మ.. విషయాన్ని బ్లూకోల్డ్ సిబ్బందికి ఫోన్ ద్వారా సమాచారమిచ్చింది. ఆఘమేఘాల మీద చెన్నమ్మ ఇంటికి చేరిన బ్లూకోల్డ్ సిబ్బంది రామాంజనేయులు, నరసింహానాయుడు.. గొడ్డలితో తలుపులను బద్దలు కొట్టారు. అప్పటికే ఉరేసుకుని ఫ్యాన్‌కు వేళాడుతున్న సుబ్బారాయుడును కిందికి దించి ప్రొద్దుటూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తన కుమారుడిని కాపాడిన బ్లూ కోల్డ్ సిబ్బందికి చెన్నమ్మ కృతజ్ఞతలు తెలిపింది. బ్లూ కోల్డ్ సిబ్బంది వేగంగా స్పందించి కేవలం 9 నిమిషాల్లోనే యువకుడిని కాపాడిన వార్త వైరల్‌గా మారడంతో ప్రొద్దటూరు పోలీసులను స్థానికులు ప్రశంసల్లో ముంచెత్తారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..