(Agri Infotech) అమరావతి: వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్రంలో తొలిసారిగా అగ్రి ఇన్ఫోటెక్ ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన శాఖ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ఈ ప్రదర్శనను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాయి. గుంటూరులోని యూనివర్సిటీ క్యాంపస్ ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శన జరుగనున్నది. 200కు పైగా అగ్రి ఇన్ఫోటెక్ కంపెనీలు ఈ ప్రదర్శనలో పాలుపంచుకోనున్నాయి.
సాంకేతిక ఆవిష్కరణలు, వ్యవసాయ పద్ధతులు, వాతావరణ మార్పు వంటి అంశాలు వ్యవసాయ పద్ధతులను ఎలా ప్రభావితం చేస్తున్నాయో.. వాటికి పరిష్కారాలను చూపడం ఈ ప్రదర్శన లక్ష్యం. ఎగ్జిబిషన్ నిర్వహణకు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. అగ్రి ఇన్ఫోటెక్-2021లో పాల్గొనే వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పంటలపై అవగాహన పెంచడంతోపాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సూచనలు, సలహాలను అందజేస్తుంది. ఎరువుల నాణ్యత, వినియోగం, సేంద్రియ పద్ధతుల అమలు వంటి అంశాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఈ ప్రదర్శన ద్వారా సమీకృత పోషకాలు, తెగుళ్ల నియంత్రణకు పరిష్కారాలను అన్వేషించడానికి ప్రయత్నిస్తుంది. సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ అనుకూల వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ కూలీల కొరత వంటి అంశాలపై చర్చించనున్నారు.
మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు ఎవరో తెలుసా?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
టెక్ నిపుణులకు కొలువులు ఫుల్.. పుంజుకుంటున్న మొబైల్ టెక్!
భగవద్గీత అసలు ఎందుకు చదవాలి?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..