(Murder and loot) కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ వైన్ షాపులో దొంగతనానికి వచ్చిన దొంగలు.. అక్కడి వాచ్‌మెన్‌ను దారుణంగా హత్య చేశారు. అనంతరం షాపులోని సొత్తును దొంగలు ఎత్తుకెళ్లారు. దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం ప్రత్యేక గాలింపు చేపట్టారు.
కృష్ణా జిల్లా జీ కొండూరు మండలం పరిధిలోని వెలగలేరు గ్రామంలో గవర్నమెంట్ వైన్‌షాపులో శనివారం దొంగలు పడ్డారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తుల అలజడిని అక్కడే వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సాంబయ్య గుర్తించాడు. ఎవరు అంటూ ప్రశ్నించి ముందుకు కదిలే లోపు దొంగలు సాంబయ్యపై దాడికి పాల్పడ్డారు. దాంతో తీవ్రంగా గాయపడిన సాంబయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం దొంగలు వైన్ షాపులోకి ప్రవేశించి అందినకాడికి దోచుకుని పరారయ్యారు. ఉదయం గ్రామస్థులు సాంబయ్య హత్యను గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సాంబయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా పోలీసులు రంగంలోకి దిగారు.
చర్మ క్యాన్సర్ ఎందుకు వస్తుందో కారణం తెలిసిపోయింది!
సోరియాసిస్ బాధితులకు గుడ్‌న్యూస్.. శాశ్వత పరిష్కారం దొరికినట్టే
నొప్పి లేని, మచ్చ రాని వీనోట్స్ సర్జరీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..