Harish Rao | జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులివ్వాలి : హరీష్ రావు
Harish Rao | కేసీఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా..? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ప్రశ్నించారు.
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చిందని.. ఉద్యోగులకు 1% కంట్రిబ్యూషన్‌తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచితంగా సేవలు అందించాలని నిర్ణయించాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. మంగళవారం వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులను హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి పరిశీలించారు.
ఆసుపత్రి పనుల పురోగతిని పరిశీలించిన అనంతరం హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ 100 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జర్నలిస్టుల కోసం ఒక్క రూపాయి అయినా కేటాయించిందా..? అని ప్రశ్నించారు.
రెండున్నరేళ్లలో ఒక్కరికైనా కొత్త అక్రిడిటేషన్ కార్డ్ ఇచ్చారా..? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధనలు లేకుండా అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసినట్లుగా జర్నలిస్టుల యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌కు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని.. లేదంటే ప్రమాదవశాత్తు జర్నలిస్టులు మరణిస్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌కు సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
LIVE : వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
https://t.co/mnOYVrVT3d— BRS Party (@BRSparty) February 24, 2026
Read Also :
‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

