KTR | సిరిసిల్లలో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. వెంకటేశం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీనిచ్చారు.
ఈ సందర్భంగా వెంకటేశం కూతురు చదువుతున్న స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి.. మీ శాతవాహన స్కూల్లో వాళ్ల పాప ప్రసన్న ఐదో తరగతి చదువుతుంది. మొత్తం ఆ అమ్మాయికి 10వ తరగతి దాకా నేనే చదవిపిస్తా. ఒక రూపాయి కూడా మీరు తీసుకోవద్దు. మొత్తం నేను కడతానని చెప్పారు. రూ.3 లక్షలు పాప పేరు మీద ఫిక్స్ డిపాజిట్ చేయించిన. ఇంకేమైనా ఉంటే కూడా నేను సాయం చేస్తానని భరోసానిచ్చారు. మీరు భయపడొద్దు. పాప చదువు బాధ్యత తీసుకోవడంతోపాటు ఇల్లు కట్టిస్తానని కేటీఆర్ హామీనిచ్చారు. వెంకటేశం మృతికి కారణమైన వారిని శిక్ష పడేంత వరకు వదిలిపెట్టనని కేటీఆర్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
తండ్రిని కోల్పోయిన చిన్నారి చదువు బాధ్యతతో పాటు, వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా నాదే అని హామీ ఇచ్చిన కేటీఆర్ pic.twitter.com/S0Wzwwc6UY
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2026
Ketogenic Diet | కీటోజెనిక్ డైట్ అంటే ఏమిటి.. భారతీయులకు ఇది సెట్ అవుతుందా..?
Amit Shah | అన్నింటికీ సమాధానం ఇస్తానన్న అమిత్ షా.. భయం లేదన్న రాహుల్ గాంధీ
FCRA Bill: జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు.. లోక్‌సభలో తీర్మానం పాస్