Russian Intelligence: ఉక్రెయిన్‌కు నాటో దేశాల అణుబాంబు టెక్నాలజీ: రష్యా ఇంటెలిజెన్స్
Russian intelligence: అణు బాంబు తయారీ టెక్నాలజీని ఉక్రెయిన్‌కు నాటో దేశాలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రష్యా ఇంటెలిజెన్స్ ఓ నివేదికలో పేర్కొన్నది. నాటోలోని ఫ్రాన్స్, యూకే దేశాలు కొన్ని కాంపోనెంట్స్‌ను సరఫరా చేయనున్నట్లు రష్యా విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించింది.
మాస్కో: అణు బాంబు తయారీకి చెందిన పరికరాలను ఉక్రెయిన్‌కు నాటో దేశాలు ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రష్యా ఇంటెలిజెన్స్ (Russian Intelligence) ఓ నివేదికలో పేర్కొన్నది. నాటోలోని ఫ్రాన్స్, యూకే దేశాలు కొన్ని కాంపోనెంట్స్‌ను సరఫరా చేయనున్నట్లు రష్యా విదేశీ ఇంటెలిజెన్స్ సర్వీస్ వెల్లడించింది. అయితే ఆ కాంపోనెంట్స్‌ను ఉక్రెయిన్ అసెంబ్లింగ్ చేసి, స్వదేశీయంగా అణు బాంబును డెవలప్ చేసినట్లు ఉక్రెయిన్ చెప్పుకుంటుందని రష్యా ఇంటెలిజెన్స్ చెప్పింది. యురోపియన్ దేశాలు తయారు చేసే కాంపోనెంట్లు, ఈక్విప్మెంట్, టెక్నాలజీని ఉక్రెయిన్‌కు ట్రాన్స్ఫర్ చేసే ఆలోచనలో బ్రిటన్, ఫ్రెంచ్ అధికారులు ఉన్నట్లు తెలిసింది.
ఫ్రాన్స్ తన జలాంతర్గాముల్లోని బాలిస్టిక్ క్షిపణలకు వాడే టీఎన్ 75 వార్‌హెడ్‌ను కీవ్‌కు అందజేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు రష్యా ఆరోపిస్తున్నది. రేడియోధార్మికత ఉన్న పదార్ధాలతో డర్టీ బాంబును ఉక్రెయిన్ తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు రష్యా ఇంటెలిజెన్స్ పేర్కొన్నది. అయితే నాటోలో కీలకమైన జర్మనీ మాత్రం ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నట్లు రిపోర్టులో తెలిపారు. ఒకవేళ నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అణు టెక్నాలజీ అందిస్తే అప్పుడు ఆ బాధ్యత వారిపైనే ఉంటుందని రష్యా పేర్కొన్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

