Shocking Video | గ్రేటర్ నోయిడాలో పట్టపగలే యువకుడి హత్య.. ఇంటిముందే కాల్చిచంపిన దుండగులు
Shocking Video : గ్రేటర్ నోయిడాలో వరుసగా హత్య ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక యువకుడిని పట్టపగలే దుండగులు గన్‌తో కాల్చి చంపారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.
Shocking Video : గ్రేటర్ నోయిడాలో వరుసగా హత్య ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక యువకుడిని పట్టపగలే దుండగులు గన్‌తో కాల్చి చంపారు. ఈ ఘటన గ్రేటర్ నోయిడా పరిధిలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడా, ఎకోటెక్-1 పోలీస్ స్టేషన్ పరిధిలో నితిన్ అనే యువకుడిని అతడి ఇంటి సమీపంలోనే కాల్చి చంపారు.
నితిన్ తన ఇంటి వద్ద, చిన్న రోడ్డులో ఉండగా.. ముగ్గురు యువకుల్ చేతిలో గన్స్‌తో వచ్చారు. వెంటనే నితిన్‌ను వెంటాడి అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనతో అక్కడున్న పిల్లలు భయంతో పారిపోయారు. నితిన్‌ను షూట్ చేస్తున్న యువకుల్ని చూసి దగ్గర్లోని ఒక మహిళ అరవగా.. చేతిలో గన్‌తో వాళ్లు ఆమెను బెదిరించారు. నితిన్‌ను దుండగులు అతి సమీపం నుంచి కాల్చి పారిపోయారు. ఈ ఘటనలో నితిన్‌కు తీవ్ర గాయాలై, రక్తస్రావం జరిగింది. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ నితిన్ మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పందించారు. సీనియర్ పోలీస్ అధికారి సుధీర్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని, ఘటన జరిగిన తీరును పరిశీలించారు. మృతుడు నితిన్‌కు కొంతకాలం నుంచి స్థానికులతో విబేధాలున్నట్లు తేలింది.
🚨 ग्रेटर नोएडा में खूनी संघर्ष, युवक की गोली मारकर हत्या
थाना इकोटेक क्षेत्र के लुक्सर गांव में आपसी रंजिश के चलते नितिन नामक युवक की गोली मारकर हत्या कर दी गई।
बताया जा रहा है कि बदमाशों ने उसे चारों तरफ से घेरकर फायरिंग की, जिससे वह गंभीर रूप से घायल हो गया।
घायल नितिन को… pic.twitter.com/wzgrIS4vVW
— PRIYA RANA (@priyarana3101) February 24, 2026
ఈ గొడవలే అతడి హత్యకు దారి తీసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. హత్య చేసినట్లుగా భావిస్తున్న నిందితుడు సచిన్, అతడి సన్నిహితుల్ని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో తాజా కాల్పులు, హత్య నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీగా బలగాల్ని మోహరించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

