(Two arrest) గుంటూరు : పటమట లంక పంట కాలువ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్లో చోరీని పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.9.72 లక్షల నగదు, 6.7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ వీ హర్షవర్ధన్ రాజు కేసు వివరాలను వెల్లడించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మార్కండేయ కాలనీకి చెందిన వేముల శ్రీను శ్రీలక్ష్మి అపార్ట్మెంట్లో గత కొన్నేండ్లుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య లక్ష్మి పనిమనిషిగా పనిచేస్తున్నది. అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో నివసించే ఓ కుటుంబం ఈ నెల 10న హైదరాబాద్ వెళ్తున్నారని తెలుసుకున్న నిందితులు.. భార్యను పుట్టింటికి పంపించి, అదే రోజు రాత్రి ఇనుప రాడ్‌తో ఫ్లాట్ తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. చోరీ సొత్తులో రూ.4.72 లక్షలు, కొంత బంగారు ఆభరణాలు తన వద్దే ఉంచుకున్నాడు. మిగిలిన సొత్తును గుంటూరు జిల్లా పెదకాకానిలో నివాసముంటున్న అన్నయ్య వేముల మహేష్ వద్ద దాచిపెట్టాడు.
ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, దొంగతనం తర్వాత శ్రీను కనిపించకుండా పోవడంతో పోలీసులు ఆయనపైనే అనుమానం పెంచుకున్నారు. కాగా, బుధవారం వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్లో చోరీ సొత్తును విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా.. శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించారు. మీడియా సమావేశంలో సీసీఎస్ ఏడీసీపీ కే శ్రీనివాసరావు, ఏసీపీ సీహెచ్ శ్రీనివాసరావు, సెంట్రల్ ఏసీపీ ఎస్ ఖాదర్ బాషా పాల్గొన్నారు.
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
శృంగార సమయంలో అతిచేస్తే మొదటికే మోసం..!
ప్రతి మూత్రపిండ రోగీ డయాలసిస్ చేయించుకోవాలా? అసలు ఎవరికి అవసరం?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..