Ketan Agarwal | కేతన్‌తో పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పిన సియా.. హత్య కోసం ప్రియుడితో కలిసి కేఫ్‌లోనే ప్లాన్
Ketan Agarwal : పూనే యువకుడు కేతన్ అగర్వాల్ (26)తో పెళ్లి ఇష్టం లేదని సియా గోయల్.. తన కుటుంబ సభ్యులకు చెప్పిన విషయం తాజాగా బయటపడింది. అయినప్పటికీ ఆమె కుటుంబం సియాను పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం.
Ketan Agarwal : పూనే యువకుడు కేతన్ అగర్వాల్ (26)తో పెళ్లి ఇష్టం లేదని సియా గోయల్.. తన కుటుంబ సభ్యులకు చెప్పిన విషయం తాజాగా బయటపడింది. అయినప్పటికీ ఆమె కుటుంబం సియాను పెళ్లికి ఒప్పించినట్లు సమాచారం. మహారాష్ట్ర, పూనేకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్‌ను కాబోయే భార్య సియా గోయల్ ఈ నెల 18న హత్య చేసిన సంగతి తెలిసిందే. కేతన్‌ను లోహగడ్ కోటకు తీసుకెళ్లిన సియా.. అతడిని లోయలో తోసి చంపేసింది. ఈ ఘటనలో నిందితులు సియా, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఈ విచారణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. 20 ఏళ్ల సియా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. పెళ్లికి తాను మానసికంగా సిద్ధంగా లేనని, పైగా కేతన్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఆమె తన కటుంబ సభ్యులకు అనేకసార్లు చెప్పింది. అయినప్పటికీ, పట్టించుకోకుండా ఆ కుటుంబం కేతన్ అగర్వాల్‌తో పెళ్లి నిర్ణయించారు. నిశ్చితార్థం కూడా జరిపించారు. నవంబర్‌లో పెళ్లికి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. కొంతకాలంగా సియా.. చేతన్ చౌదరితో ప్రేమలో ఉంది. ఈ నేపథ్యంలో కేతన్‌తో పెళ్లి ఇష్టం లేని సియా.. దీన్నుంచి బయటపడేందుకు అతడిని ప్లాన్ చేసి చంపడం ఒక్కటే మార్గమని భావించింది. తన ప్రియుడు చేతన్‌తో కలిసి కుట్ర పన్నింది.
ఆరు నెలల్లో 2004 ఫోన్‌కాల్స్
సియా గోయల్, చేతన్ చౌదరి మధ్య చాలాకాలంగా ప్రేమ ఉన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ గత ఆరు నెలల కాలంలో 2,004 సార్లు ఫోన్ చేసుకున్నారు. ఈ ఆరు నెలల సమయంలో మొత్తం 238 గంటలు కాల్స్ మాట్లాడారు. అందులో కొన్ని కాల్స్ 2 నుంచి 3 గంటల వరకు సాగినట్లు పోలీసులు గుర్తించారు. కేతన్ హత్యకు ముందు రోజు సియా, చేతన్.. ఇద్దరూ సాయంత్రం ఒక కేఫ్‌లో కలుసుకున్నారు. దాదాపు గంటసేపు మాట్లాడుకున్నారు. ఈ సమయంలోనే కేతన్ హత్యకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అతడిని పర్వతంపై నుంచి తోసేయాలని ప్లాన్ చేశారు. ఇందుకు అనువైన ప్రదేశాన్ని కూడా ఇద్దరూ కలిసి నిర్ణయించారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

