న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో నిధులను దుర్వినియోగం చేశారని, ఆ ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకో(Supreme Court)ర్టును ఓ పిటీషనర్ ఇవాళ ఆశ్రయించాడు. అయితే జూన్ 29వ తేదీన సోమవారం కోర్టుకు వచ్చి పిల్‌ను దాఖలు చేసుకోవాలని ఆ పిటీషనర్‌కు సుప్రీంకోర్టు చెప్పింది. నిధుల దుర్వినియోగం అంశంపై దర్యాప్తునకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని, అలాగే నిర్దేశిత సమయంలోగా నిధులపై దర్యాప్తును పూర్తి చేయాలని ఆ పిటీషన్లో కోరారు. సీబీఐ నేతృత్వంలోని సిట్ ప్రస్తుతం అయోధ్య నిధులపై దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే.
అడ్వకేట్లు అజయ్ కుమార్ రాయ్, దినేశ్ కుమార్ యాదవ్.. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.కోట్లాది భక్తుల, దాతల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రజాప్రయోజనాల రక్షణ కోసం నిధుల నిర్వహణ అంశంలో ఓ రెగ్యులేటరీ వ్యవస్థను తయారు చేయాలని కోరుతూ కేంద్రం, యూపీ సర్కారు, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటీషన్లో కోరారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ తో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విన్నది. లిస్టింగ్ కోసం సోమవారం పిల్ దాఖలు చేయాలని కోర్టు సూచించింది.